ఫస్ట్ గిఫ్ట్ : క్లాసికల్ పాటను అలవోకగా అందుకున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని గతకొద్ది రోజులుగా అభిమానులు చేస్తున్న రచ్చ మామూలుగా లేదు.ఈ వేడుక కోసం నందమూరి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Balakrishna Croons Shiva Shankari Song, Balakrishna, Shiva Shankari Song, Nbk Fi-TeluguStop.com

కాగా తన పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు రెండు గిఫ్టులను రెడీ చేశాడు బాలయ్య.ఇందులో భాగంగా తాను స్వయంగా పాడిన ఓ పాటను రిలీజ్ చేస్తానని చెప్పుకొచ్చిన బాలయ్య, అన్నట్లుగానే దాన్ని రిలీజ్ చేసి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు.

సీనియర్ ఎన్టీఆర్ నటించిన సెన్సేషనల్ మూవీ ‘జగదేకవీరుని కథ’ చిత్రంలో శివశంకరీ పాటకు ఎలాంటి క్రేజ్ ఉండేదో అందరికీ తెలిసిందే.ఈ పాటను ప్రొఫెషనల్ సింగర్స్ తమ ప్రాక్టీస్‌కు చాలా ఉపయోగ పడుతుందని దీన్ని పదేపదే పాడుతుంటారు.

కాగా ఈ పాటను తాజాగా బాలయ్య స్వయంగా పాడి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.బాలయ్య ఈ పాట కోసం ఎంతో కఠోర శిక్షణ తీసుకున్నట్లు పాటను వింటే తెలుస్తోంది.

మొత్తానికి బాలయ్య తన అభిమానుల కోసం తనదైన స్టయిల్‌లో, మరెవ్వరికీ సాధ్యం కాని రీతిలో పాటను పాడి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.కాగా బాలయ్య పుట్టినరోజు కానుకగా రిలీజ్ అయిన ఈ తొలి గిఫ్ట్ చాలా బాగుండటంతో ప్రేక్షకులు ఈ పాటను పదే పదే వింటున్నారు.

ఇక ఈ కానుకకు ఏమాత్రం తీసిపోకుండా తన సెకండ్ గిఫ్ట్‌ను కూడా రెడీ చేసే పనిలో పడ్డాడు బాలయ్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube