ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు పెళ్లి చేసుకుని...

తెలుగులో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించినటువంటి “రణం” అనే చిత్రంలో గోపీచంద్ సరసన ఆడిపాడినటువంటి బాలీవుడ్ ముద్దుగుమ్మ కామ్నా జఠ్మలానీ ఇప్పటికీ ప్రేక్షకులను బాగానే గుర్తు ఉంటుంది.అయితే ఈ అమ్మడు తెలుగులో జగపతిబాబు, ప్రిన్స్ మహేష్ బాబు, అల్లరి నరేష్, రాజా, తదితర స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.

 Kamna Jethmalani, Tollywood Heroine, Life News, Tollywood, Movie News-TeluguStop.com

కానీ ఈ అమ్మడు నటించినటువంటి కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.దాంతో ఈ అమ్మడు 2014వ సంవత్సరంలో బెంగళూరుకు చెందినటువంటి ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.

అయితే ఈ మధ్యకాలంలో కామ్నా జఠ్మలానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందుబాటులో ఉంటోంది.అంతేగాక తన కుటుంబ సభ్యుల ఫోటోలను అప్పుడప్పుడు అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ తన అభిమానులను అలరిస్తోంది.

అయితే ప్రస్తుతం కామ్నాజఠ్మలానీ కి ఒక బాబు కూడా ఉన్నట్లు సమాచారం.అయితే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కామ్నాజఠ్మలానీ అప్పుడప్పుడు అడపా దడపా చిత్రాలతో తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులని అలరిస్తూనే వస్తోంది.

అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి తన భర్తకు వ్యాపారంలో సహాయం చేస్తూ కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే పనిలో పడినట్లు సమాచారం.

ప్రస్తుతం కామ్నా జఠ్మలానీ తన భర్త తో కలిసి బెంగుళూరులో నివాసముంటోంది.

 అయితే ప్రస్తుతం కామ్నాజఠ్మలానీచేతిలో కొత్త చిత్రాలకి సంబంధించి అవకాశాలేమి లేవు. అంతేకాక ప్రస్తుతం హీరోయిన్ ప్రపంచంలో రోజురోజుకీ పోటీ పెరుగుతుండడంతో కామ్నాజఠ్మలానీ సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube