కరువుతో కొట్టుమిట్టాడుతూ  50,000 రూపాయల మద్యం కొన్నాడు.. చివరికి  

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే తాజాగా కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మద్యం దుకాణాలను తెరిచి మద్యం అమ్మకాలు చేపట్టారు.

 Liquor Purchasing, 50,000 Rupees Liquor, Wine Shops News, Karnataka, Bengaluru,-TeluguStop.com

దీంతో ఒక్కసారిగా మందుబాబులు కిలోమీటర్ల మేర మద్యం దుకాణాలకు క్యూ కడుతూ మందు కోసం మద్యం దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు.మామూలుగా ఎంత మద్యం కరువులో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ 1000, 2000 లేదా మహా అయితే 10,000 రూపాయలు ఖర్చు చేసి మద్యం బాటిళ్లను కొనుక్కుంటారు.

కానీ కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి బెంగళూరు ప్రాంతంలో ఓ వ్యక్తి ఏకంగా 50 వేల రూపాయలకు పైగా వెచ్చించి మద్యాన్ని కొనుగోలు చేశాడు.అంతేగాక ఈ విషయాన్నిమరియు మద్యం కొనుగోలు రసీదును కూడా ఫోటో తీసి తన స్నేహితులతో పంచుకున్నాడు.

 దీంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకుతూ సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగానే ట్రెండ్ అవుతుంది.దీంతో ఎక్సైజ్ అధికారులు ప్రస్తుతం ఆ వ్యక్తిని పట్టుకునే పనిలో పడ్డారట.

అయితే మద్యం కొనుగోలు చేస్తే పోలీసులు అరెస్టు చేయడం ఏంటని ఆలోచిస్తున్నారా.? ఇక్కడే ఉంది అసలైన తిరకాసు.

సాధారణంగా లాక్ డౌన్ సమయంలో ఒక వ్యక్తికి 2.6 లీటర్ల మద్యం మాత్రమే విక్రయించాలి.అయితే శీతల పానీయం అయినటువంటి బీర్ మాత్రం 18 లీటర్ల వరకు ఒక వ్యక్తికి విక్రయించవచ్చు.కానీ ఆ వ్యక్తి కొనుగోలు చేసినటువంటి మద్యం దుకాణంలో దాదాపుగా 13 లీటర్ల మద్యంతో పాటు 35 లీటర్ల బీరుని విక్రయించారు.

దీంతో మద్యం దుకాణాల దారుడు మరియు కొనుగోలు చేసినటువంటి వ్యక్తి పై పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube