హిందూ మహాసముద్రం వింత వలయాకారం... వాటి రహస్యం చేధించిన అమెరికా

అప్పుడప్పుడు సముద్రాలలో కొన్ని వింతలు కనిపిస్తూ ఉంటాయి.అయితే ఆ వింతలు గురించి మాట్లాడుకోవడం తప్ప వాటి రహస్యం అంత వేగంగా కనిపెట్టలేరు.

 Longest Stringy Thing Floating In Ocean Surprises Scientists, Mysteries, America-TeluguStop.com

ఇలాంటి వింతలు ప్రపంచం అంతా ప్రచారం అయిపోతాయి.మత విశ్వాసులు ఇలాంటి వాటిని ఏదో అద్భుత శక్తి అని నమ్ముతారు.

అయితే శాస్త్రవేత్తలు మాత్రం వాటిపై పరిశోధనలు చేసి చేధించే ప్రయత్నం చేస్తారు.ఇప్పుడు హిందూ మహాసముద్రంలో కనిపించిన వింత వలయాలని ఏర్పరించిన ఆకారాన్ని అమెరికా పరిశోధకులు చేధించారు.

ఓ పొడవైన తీగ వంటి శరీరంతో సుమారు 150 అడుగుల వరకు ఉన్న ఈ భారీ రూపాన్ని ఇప్పటివరకు ఎవరూ చూడలేదు.

హిందూ మహాసముద్రంలోని నింగాలూ కాన్యన్ ప్రాంతంలో నీటిపై ఇలాంటి వలయాకారం కనిపించగా అమెరికాకు చెందిన ష్మిట్ ఓషన్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకుల డ్రోన్ కెమెరాతో షూట్ చేశారు.

శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేసి ఆ ఆకారాన్ని ఏర్పరించింది సైఫనోఫోర్ వర్గానికి చెందని అపోలెమియా అనే జీవిగా తేల్చేసారు.దీనికి నీటిపై తేలియాడే కాలనీగా పేర్కొన్నారు.ఇవి జెల్లీఫిష్ అని, కోరల్స్ వర్గానికి చెందిన జీవులని, సముద్ర గర్భంలో బాగా లోతైన ప్రాంతాల్లో సంచరిస్తుంటాయని ఈ పరిశోధనలో తెలిపారు.వాస్తవానికి సైఫనోఫోర్ జీవులు చాలా చిన్నవని, చూడ్డానికి క్లోనింగ్ చేసిన జీవుల్లా ఒకేలా ఉంటాయని అన్నీ కలిసి ఒకే దేహంలా కలిసిపోయి ఇలా ఏర్పడతాయని వివరించారు.

సముద్రగర్భంలో ఎక్కువగా ఉండే ఈ జీవులు నీటిపై తేలియాడుతూ కనిపించడం ఇదే మొదటిసారి అని తెలియజేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube