పిల్లలకు టీచర్లు విద్యా నేర్పడంతో పాటు మంచి బుద్దిని కూడా నేర్పించాలి.అలా చేసినప్పుడే వారు ప్రయోజకలు అవుతారు.
విద్యను నేర్పించి బుద్ది నేర్పకుంటే వారు ప్రయోజకులు అవ్వరు.వారు తప్పు చేస్తే సరి చేస్తూ అందుకు గల కారణాలు అన్వేషించి వారిని సక్రమ మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది.
కాని కొందరు టీచర్లు విద్యార్థులను చెడు దిశగా ప్రోత్సహించడం దారుణం.ఇప్పటి వరకు విద్యార్థినుల జీవితాతో ఆడుకున్న టీచర్లను చూశాం.
కాని ఇప్పుడు తప్పు చేయండి అంటూ ప్రోత్సహించిన టీచర్ గురించి మీకు చెప్పబోతున్నాను.
ప్రస్తుతం పరీక్షల సీజన్ నడుస్తోంది.
ఈ సమయంలో విద్యార్థులకు చాలా జాగ్రత్తగా పాఠాలు చెప్పాలి.కాని ఈయన మాత్రం విద్యాబుద్దులు చెప్పడం మానేసి చీటింగ్ నేర్పిస్తున్నాడు.
పరీక్షలు దగ్గరకు వస్తున్న సమయంలో ముఖ్యమైన ప్రశ్నలు నేర్చుకోండి అంటూ చెప్పి పరీక్షలు నిర్వహించాల్సిన ఆ ఉపాధ్యాయుడు చిట్టీలు ఎలా కొట్టాలి, ఎలా చూసుకుంటూ రాయాలి అంటూ చెబుతున్నాడు.ఒకరికి ఒకరు ఎలా చూపించుకోవాలి, పరీక్షల్లో ఒకిరిక ఒకరు ఎలా సహకరించుకోవాలంటూ చెప్పడం జరిగింది.
పరీక్షల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం తప్పేం కాదు.కాని ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సహకరించుకుంటూ రాయాలి.ఇక చిట్టీలు పెట్టి ఇన్విజిలేటర్‌కు దొరికిన సమయంలో వారికి సారీ చెప్పాలి.వారిని రిక్వెస్ట్ చేయాలి అంతే తప్ప గడుసుగా వారితో వాదనకు దిగకూడదు.వారిని కన్నీరు పెట్టుకుని రిక్వెస్ట్ చేయడం వల్ల వారు ఏమైనా సాయం చేయవచ్చు.ఆన్సర్ షీట్ లో 100 రూపాయలు పెట్టాలని కూడా సూచించాడు.
అందుకే చిట్టీలు పెట్టి దొరికిన వారు భయపడాల్సిన పనిలేదు అంటూ వింత సలహా ఇచ్చాడు.ఉత్తరప్రదేశ్‌లోని ఒక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది.
యూపీలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం వైరల్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు ఆ సార్‌ను అరెస్ట్ చేశారు.విద్యార్థులకు ఇలాంటివేనా నేర్పించేది అంటూ పోలీసులు అతడిని మందలించడంతో పాటు కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు.
కోర్టు ముందు అతడిని ప్రవేశ పెట్టబోతున్నారు.