రివ్యూ : నితిన్‌ ఫ్లాప్‌లకు ‘భీష్మ’ బ్రేక్‌ వేసిందా?

శ్రీనివాస కళ్యాణం చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుని నితిన్‌ ఆ సినిమాను చేశాడు.కాని ఆ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది.

 Bheeshma Movie Telugu Review And Rating-TeluguStop.com

ఆ సినిమా ఇచ్చిన చేదు అనుభవం నుండి తేరుకునేందుకు ఏడాది కాలం పట్టింది.ఎట్టకేలకు మనోడు ఈ చిత్రాన్ని చేశాడు.

ఛలో దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.సినిమాకు పాజిటివ్‌ బజ్‌ ఉంది.

రష్మిక మందన నటించడం వల్ల సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

భీష్మ(నితిన్‌) సోషల్‌ మీడియాలో టైం పాస్‌ చేస్తూ సింగిల్‌ గా జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు.అలాంటి సమయంలో మనోడికి హీరోయిన్‌తో పరిచయం అవ్వడం, ఆమెతో ప్రేమలో పడటం జరుగుతుంది.

లవ్‌ స్టోరీ కొనసాగుతున్న సమయంలో భీష్మ ఆర్గానిక్‌ కంపెనీతో ఈయనకు సంబంధం ఏర్పడుతుంది.భీష్మ ఆర్గానిక్‌ కంపెనీకి అనూహ్య పరిణామాల మద్య భీష్మ 30 రోజుల పాటు సీఈఓగా చేయాల్సి వస్తుంది.

ఆ సమయంలో అతడు ఎదుర్కొన్న పరిణామాలు ఏంటీ? ఆ సమస్యల నుండి ఎలా బయట పడ్డాడు అనేది సినిమా చూసి తెలుసుకోండి.

Telugu Bheeshma Day, Bheeshma, Bheeshma Review, Nithiin-Movie

నటీనటుల నటన :

నితిన్‌ ఎనర్జిటిక్‌ నటనతో మెప్పించాడు.డైలాగ్‌ డెలవరీ మరియు రొమాంటిక్‌ సీన్స్‌లో మెప్పించాడు.డాన్స్‌లతో కూడా ఈసారి నితిన్‌ మెప్పించే ప్రయత్నం చేశాడు.

కొన్ని కామెడీ సీన్స్‌ మరియు యాక్షన్‌ సీన్స్‌లో నితిన్‌ నిరాశ పర్చినా ఓవరాల్‌గామ ఆత్రం నితిన్‌ భీష్మ పాత్రకు న్యాయం చేశాడు.ఇక రష్మిక మందన తన పాత్రకు న్యాయం చేసింది.

ఈమెకు ఉన్న ప్రాముఖ్యత వరకు బాగానే చేసింది.ఈ అమ్మడు చేసిన ఈ పాత్ర ఆమె కెరీర్‌లో నిలిచి పోతుంది.

నితిన్‌తో ఈమె రొమాన్స్‌ బాగా వర్కౌట్‌ అయ్యింది.వెన్నెల కిషోర్‌ ఇంకా ఇతర కమెడియన్స్‌ కామెడీతో మెప్పించారు.ఇతర పాత్రల్లో నటించిన వారు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.

టెక్నికల్‌ :

భీష్మలోని పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు.విడుదలకు ముందే ఈ పాటలు విడుదల అయ్యాయి.శ్రోతలను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి.ఒకటి రెండు పాటల చిత్రీకరణ మరియు డాన్స్‌ మాత్రం బాగుంది.ఇక బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో మెప్పించాడు.

సినిమాటోగ్రఫీ బాగుంది.దర్శకుడు వెంకీ కుడుముల స్క్రీన్‌ప్లేను కామెడీతో నడిపించి ప్రేక్షకులకు ఎక్కడ బోర్‌ కొట్టించలేదు.

ఎడిటింగ్‌ కూడా బాగానే ఉంది.అక్కడక్కడ చిన్న చిన్న జర్క్‌లు మినహా అంతా బాగానే ఉంది.

నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా ఉన్నాయి.

Telugu Bheeshma Day, Bheeshma, Bheeshma Review, Nithiin-Movie

విశ్లేషణ :

ఈ కథ కోసం దాదాపుగా ఏడాది కాలం పాటు నితిన్‌ వెయిట్‌ చేశాను అన్నాడు.కథలో పదే పదే మార్పులు చెబుతుండటంతో ఒకానొక సమయంలో దర్శకుడు వెంకీ కుడుముల, నితిన్‌ల కాంబోలో సినిమా ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.చివరకు సినిమా పట్టాలు ఎక్కింది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చిందని చెప్పుకోవచ్చు.సినిమా కథ సింపుల్‌గా ఉన్నా దాన్ని నడిపించిన తీరు ఆకట్టుకుంది.

ముఖ్యంగా నితిన్‌, వెన్నెల కిషోర్‌ ఇంకా కమెడియన్స్‌ మద్య సాగే సీన్స్‌ సినిమా స్థాయిని పెంచేశాయి.సినిమాలోని సీరియస్‌ సీన్స్‌లో కూడా కామెడీని పెట్టే ప్రయత్నం చేసిన దర్శకుడు సఫలం అయ్యాడు.మొత్తానికి నితిన్‌కు ఒక మంచి హిట్‌ పడ్డట్లే.

ప్లస్‌ పాయింట్స్‌ :

నితిన్‌, రష్మికల నటన, రొమాన్స్‌,
కామెడీ సీన్స్‌,
ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ సీన్స్‌,
సోషల్‌ మీడియా మీమ్స్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :

కొన్ని సీన్స్‌ రొటీన్‌గా అనిపించాయి,
పాటలు,
క్లైమాక్స్‌ సింపుల్‌గా ఉంది,
కథ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది.

బోటమ్‌ లైన్‌ :

నితిన్‌ ‘భీష్మ’గా నవ్వించి మెప్పించాడు

రేటింగ్‌ : 3.25/5.0

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube