ఇళయరాజా ప్రవర్తనపై సోషల్ మీడియాలో విమర్శలు! అందరి ముందు అలా

గత కొద్దిరోజులుగా సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా తరచుగా తన వ్యాఖ్యలతో వివాదాస్పదంగా మారుతున్నారు.ఆ మధ్య ప్రస్తుత తరం సంగీత దర్శకుల మీద ఇళయరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Ilalyaraja Controversial Beehive Sensation In Social Media-TeluguStop.com

ఈ తరం సంగీత దర్శకులు తన సినిమాలో సాంగ్స్ ని మ్యూజిక్ ని కాపీ చేసి ఇ తమ ఒరిజినల్ సాంగ్స్ కింద చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.అసలు సంగీత పరిజ్ఞానం లేని వాళ్ళు క్రియేటివిటీ అంటే తెలియని వాళ్ళు ఇలా ఒకరి క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తారని దారుణ వ్యాఖ్యలు చేశరు.

ఇదిలా ఉంటే తాజాగా ఇళయరాజా 76వ పుట్టినరోజు వేడుకలు చెన్నైలో ఓ పెద్ద ఆడిటోరియంలో జరిగింది.ఈ వేడుకల్లో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, గాయకులు పాల్గొన్నారు.

అయితే ఈ కార్యక్రమంలో ఇళయరాజా ఓ సెక్యూరిటీ గార్డుపై ఫైర్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.

స్టేజ్ మీద సంగీత కార్యక్రమం జరుగుతున్న సమయంలో సెక్యూరిటీ గార్డ్ నీళ్లు ఇవ్వడానికి వెళ్ళాడు.

దీంతో సీరియస్ అయిన రాజా అనుమతిలేకుండా స్టేజ్ మీదకు వచ్చి ఎందుకు కార్యక్రమం నాశనం చేస్తున్నానని అతనిమీద కేకలు వేసారు .ఇక అందరి ముందు అవమానం భరించలేక సదరు సెక్యూరిటీ గార్డ్ ఇళయరాజాకి సారీ చెప్పి తన కాళ్ళు పట్టుకున్నారు.అనంతరం ఈ క్రమంలో మాట్లాడుతూ చిల్లర డబ్బులు పెట్టి టికెట్టు కొనుక్కొని పదివేలు పెట్టి అడ్వాన్స్ బుక్ చేసుకున్న వారి ప్లేస్ లలో కూర్చున్నారు అంటూ ప్రేక్షకులపై దురుసుగా ప్రవర్తించారు.ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇళయరాజా మీద విమర్శలు ఎక్కువయ్యాయి.

సినిమా ఇండస్ట్రీ గౌరవించే స్థానంలో ఉండి ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube