మనం ఏ పని చేయాలన్న వినాయకుణ్ణి పూజించి తర్వాతే చేస్తూ ఉంటాం.అలాంటి వినాయకుని గురించి మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుందాం.
శివ పురాణం ప్రకారం వినాయకుని నిజమైన రంగు ఎరుపు మరియు పసుపు.
బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఒక రోజు వినాయకుడు ధ్యానంలో ఉండగా తులసి దేవి చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోమని కోరింది.
అయితే వినాయకుడు నిరాకరించటంతో తులసి దేవి కోపంతో నీకు ఎప్పటికి పెళ్లి కాదని శపించిందట.దాంతో వినాయకుడు కూడా తులసి దేవిని మొక్కగా మారమని శపించాడు.
అప్పటి నుండి తులసి మొక్కగా అందరి చేత పూజలు అందుకుంటూ ఉన్నది తులసీదేవి
వినాయకుడు,విగ్నేశ్వరుడు,ఏకదంతుడు,గణపతి,లంబోదరుడు ఇలా వినాయకుడికి 108 పేర్లు ఉన్నాయట.
బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం వినాయకుణ్ణి మొత్తం దేవతలందరూ దీవిస్తూ ఉండగా శనీశ్వరుడు మాత్రం తల దించుకొని ఉండటం గమనించిన పార్వతి కారణం ఏమిటని అడగగా నేను వినాయకుణ్ణి చూస్తే తల తెగుతుందని చెప్పుతాడు శనీశ్వరుడు.
అప్పుడు పార్వతి ఆలా ఏమి జరగదు అని చెప్పి శనీశ్వరుణ్ణి వినాయకుణ్ణి చూడమని చెప్పుతుంది.శని దేవుడు వినాయకుణ్ణి చూడగానే వినాయకుని తల తెగి కింద పడిపోయిందట.
వినాయకుణ్ణి చూసి మనం నేర్చుకోవాల్సినది చాలా ఉంది.పెద్ద చెవులు, చిన్ని కళ్ళు భారీ ఆకారం, చిన్ని వాహనం ఇలా వినాయకునిలో దాదాపుగా 57 రకాల వైవిధ్యాలను గమనించవచ్చు.
వినాయక చవితి పండుగను జనంలోకి తీసుకు వచ్చింది మాత్రం శివాజీనే.అందుకే మహారాష్ట్రలో నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి.
1893 లో బాలగంగాధర తిలక్ బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా అందరిని ఒకే తాటి మీదకు తీసుకురావటానికి కుల మత భేదం లేకుండా అందరూ సామూహికంగా చేసుకొనే విధంగా ప్రోత్సాహం ఇచ్చారు.
వినాయకుణ్ణి ఏకదంతుడు అని పిలుస్తారు.దానికి చాలా రకాల కధలు ఉన్నాయి.మూషికాసురుడు సంహరించటానికి ఒక దంతాన్ని ఉపయోగించాడని ఒక కథ.మరొక కధ ప్రకారం పరుశరాముడు శివుని దర్శనానికి వచ్చినప్పుడు వినాయకునికి పరుశరాముడికి జరిగిన యుద్ధంలో వినాయకుడు ఒక దంతాన్ని ఉపయోగించాడని చెప్పుతారు.
మట్టితో తయారుచేసిన వినాయకుణ్ణి పూజించాలి.
పూర్వ కాలంలో దగ్గరలో ఉన్న చెరువు నుంచి మట్టి తెచ్చి వినాయకుణ్ణి తయారుచేసేవారు.ఇప్పుడు ప్లాస్టిక్ విగ్రహాలను రంగులను వాడుతున్నారు.
ఇలా చేయటం వలన పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది.కాబట్టి మనం కూడా మట్టి విగ్రహాలనే పూజిద్దాం.
పర్యావరణాన్ని రక్షిద్దాం.
DEVOTIONAL