సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ని బట్టి కొందరిని గోల్డెన్ లెగ్ అని అంటారు, మరికొందరిని ఐరన్ లెగ్ అని అంటారు.మిగితావారి సంగతి ఏమో కాని, యంగ్ బ్యూటి అనుపమ పరమేశ్వరన్ మాత్రం గొల్డెన్ లెగ్ క్యాటగిరిలోకి వస్తుంది.
ఎందుకంటే ఈ అమ్మడు ఇంతవరకు అపజయమనేదే చూడలేదు.
మలయాళ సినిమా “ప్రేమమ్” తో తన కెరీర్ మొదలుపెట్టిన అనుపమ తొలిసినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది.
ఆ తరువాత చేసిన మరో మలయాళ సినిమా కూడా సక్సెస్ ని సాధించింది.ఇక తెలుగులో మొదట “అ ఆ” చేస్తే, అది కూడా బంపర్ హిట్ గా నిలిచింది.
ప్రేమమ్ తెలుగు రీమేక్ కూడా సూపర్ సక్సెస్ ని అందుకుంది.మళయాళం, తెలుగు ఇండస్ట్రీల తరువాత ఇటివలే తమిళ్ లో అడుగుపెడితే, అక్కడ కూడా ఈ రెండుపదుల ముద్దుగుమ్మకి ఘనస్వాగతం లభించింది.
ధునుష్ తో చేసిన కోడి (తెలుగులో ధర్మయోగి) మంచి సక్సెస్ ని అందుకుంది.
ఈరకంగా మూడు ఇండస్ట్రీలో హిట్లు అందుకుంది అనుపమ.
అందుకే ఆమెని లక్కి హీరోయిన్ అని అంటున్నారు.ఈ లేడి రాబోయే సినిమా శతమానంభవతి.
మరో మలయాళ సినిమా చేతిలో ఉంది.పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ సినిమాలో కూడా తనని ఓ హీరోయిన్ గా అనుకుంటున్నారట.
మరి ఈ సినిమాలతో ట్రాక్ రికార్డు అలానే ఉంటుంది లేదా మార్పులు వస్తాయో చూద్దాం.