అపన్న హస్తం అందించిన ఆది కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు 6లక్షల

అపన్న హస్తం అందించిన ఆది కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు 6లక్షల ఎల్వోసి మంజూరు పత్రం అందించిన ప్రభుత్వ విప్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం భగవంతరావు నగర్ కు చెందిన పండుగ సంతోష్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.

సంబంధిత సమస్యపై వైద్యులను సంప్రదించగా కిడ్నీ మార్పిడి చేయవలసిందిగా వైద్యులు తెలుపగా అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా ఆదేశిస్తూ,ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 6 లక్షల రూపాయలను మంజూరు చేపించి ప్రభుత్వ విప్ స్వయానా వారి ఇంటికి వెళ్లి బాధితులకు అందజేసి వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.

ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.

సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Latest Rajanna Sircilla News