ఆమె పట్టుదల ముందు చిన్నబోయిన పేదరికం

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని తాజాగా మరోసారి రుజువైంది.కడు పేదరికంలో ఉన్నా తనకు నచ్చిన క్రీడలో పేరు సంపాదించాలని చూసిన ఓ 11 ఏళ్ల అమ్మాయి తన లక్ష్యాన్ని సాధించుకునేందుకు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ అమ్మాయిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

 11 Year Old Girl Wears Bandage Instead Of Shoes-TeluguStop.com

పిలిప్పిన్స్‌‌లోని బలాసన్‌కు చెందిన రియా బుల్లోస్‌కు అథ్లెటిక్ పోటీలు అంటే చాలా ఇష్టం.దీని కోసం ఆమె ఎంతో శ్రమపడుతోంది.

అయితే పేదరికం కారణంగా ఆమె కనీసం షూ కొనే స్థితిలో కూడా లేదు.అయినా తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇవేమీ పట్టించుకోని రియా అథ్లెటిక్ పోటీల్లో పాల్గొనేందుకు తన కాళ్లకు టేపు చుట్టుకుంది.

దానిపై నైక్ అని రాసుకుని పరుగు పందెంలో పాల్గొంది.అదే కాళ్లతో ఆమె 400, 800, 1500 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని మొదటి స్థానంలో నిలిచింది.

Telugu Wears Bandage, Inspirational, Shoes, Weird-

ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారడంతో సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వార్త వైరల్ అయ్యింది.ఈ విషయం తెలుసుకున్న బాస్కెట్ బాల్ స్టోర్ ‘టైటాన్ 22’ సీఈఓ రియాకు అవసరమైన షూ, సాక్స్, స్పోర్ట్స్ బ్యాగ్ లాంటి క్రీడా సామగ్రిని ఇప్పించారు.రియా లాంటి ప్రతిభ ఉన్నవారు మధ్యలో ఆగిపోకూడదని కోరారు.ఈ చిన్నారి పట్టుదలకు నెటిజన్లు సలాం కొడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube