మామిడి తోరణాలు, స్వస్తిక్ గుర్తు... భవిష్యత్తులో ‘‘బ్రిటన్ ప్రధాని నివాసం ఇలా వుంటుందేమో’’ : ఆనంద్ మహీంద్రా ట్వీట్

బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో బ్రిటన్ కొత్త ప్రధానికి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల్లో ఒకటైన యూకేకు అత్యున్నత పదవిని అందుకునేందుకు పలువురు పోటీలో నిలిచారు.

 Future Of 10 Downing Street: Anand Mahindra Tweet Goes Viral,downing Street, Ana-TeluguStop.com

రిషి సునక్, సుయెల్లా బ్రేవర్ వంటి భారత సంతతికి చెందిన నేతలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.బ్రిటన్ హోం సెక్రటరీ ప్రీతి పటేపల్ రేసు నుంచి తప్పుకోవడంతో రిషి సునక్‌కు ప్రధాని అయ్యేందుకు లైన్ క్లియర్ అయ్యింది.

అక్కడి పలువురు ప్రముఖులు కూడా రిషికి తమ మద్ధతు ప్రకటిస్తుండటంతో ఆయన దూసుకెళ్తున్నారు.కోవిడ్ సంక్షోభ సమయంలో ఆర్ధిక మంత్రిగా సమర్ధంగా వ్యవహరించడం రిషి సునక్ కు కలిసొస్తోంది.

ఇప్పటికే ‘‘రెడీ ఫర్ రిషి’’ పేరుతో ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు.అటు మరో భారత సంతతికి చెందిన నేత సుయెల్లా బ్రేవర్‌మెన్ సైతం పోటీలో ముందంజలో వున్నారు.

ఈ నేపథ్యంలో వీరిలో ఎవరు గెలిచినా బ్రిటన్ అత్యున్నత పదవిని అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తులుగా రికార్డుల్లోకెక్కుతారు.కోట్లాది మంది భారతీయులు కూడా వీరికి మద్ధతుగా నిలుస్తున్నారు.

ఈ క్రమంలో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా బ్రిటన్ సంక్షోభంపై చేసిన ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది.

బ్రిటన్‌ ప్రధాని అధికారిక నివాసం త్వరలో ఇలా వుండనుంది అంటూ ఆయన ఓ ఫోటోను షేర్ చేశారు.

ఇందులో 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని పీఎం నివాసానికి మామిడి తోరణాలు, స్వస్తిక్ చిహ్నాలను పెట్టారు.హిందూ సాంప్రదాయంలో వీటికి విశేష ప్రాధాన్యత వున్న సంగతి తెలిసిందే.రిషి సునక్ కనుక బ్రిటన్ ప్రధాని అయితే భారతీయ సంస్కృతిని అనుసరించి.తన అధికారిక నివాసంలో ఇలా మామిడి తోరణాలు, స్విస్తిక్ చిహ్నాలను పెడతారనే ఉద్దేశం వచ్చేలా ఆనంద్ మహీంద్రా ఈ ట్వీట్ చేశారు.

అయితే ఈ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube