గుట్టపై టెన్షన్

యాదాద్రి జిల్లా:ఈ నెల 28 న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పున:ప్రారంభమైన యాదగిరిగుట్టలో ఆలయ ఇఓ తీసుకుంటున్న కొన్ని సొంత నిర్ణయాల వలన స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

శుక్రవారం రోజు గుట్టపైకి ద్విచక్ర వాహనాలను,ఆటోలను అనుమతించకపోవడంతో స్థానిక యువకులు ఈఓ నిర్ణయానికి వ్యతిరేకంగా గుట్టపై ధర్నాకు దిగారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నంలో నిరసన కారులకు పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది కలిగే విధంగా ఇఓ నిర్ణయాలు ఉన్నాయని,ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు.

Tension On The Mound-గుట్టపై టెన్షన్-Nalgonda-Telugu

ఆటోలను మరియు ద్విచక్ర వాహనాలను నిత్యం గుట్టపైకి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.దీనికి సంబంధించి ఆలయ ఇఓకు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని,సరైన నిర్ణయం తీసుకొని యెడల రెండు రోజుల్లో తీవ్ర స్థాయిలో కార్యాచరణ ఉంటుందని హెచ్చరించారు.

Advertisement

Latest Nalgonda News