తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ కవిత

ఈ ఉగాది, తెలంగాణ యువతకు ఉద్యోగ నామ సంవత్సరం, ఉగాది పండుగ వేళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక సందేశం తెలంగాణ బిడ్డలందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు.శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరి జీవితాల్లో శుభాలను తీసుకురావాలని, మనందరం బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.ఉగాది పర్వదినాన “శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్ కారాయచ.సర్వా ర్రిష్ట వినాశాయ.నింబకం దళ భక్షణమ్‌॥ అంటూ పచ్చడి తాగుతాం.ఉగాది పచ్చడిలో ఉండే తీపి, చేదు, పులుపు, ఒగరు, కారం, ఉప్పు రుచులు ఉన్నట్టుగానే, జీవితంలోనూ కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, అనేక కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన సందర్భాలు వస్తుంటాయి.

 Mlc Kavitha Ugadi Wishes The People Of Telangana Mlc Kavitha, Trs Party , Ugad-TeluguStop.com

అన్ని పరిస్థితుల్లోనూ దేవుడు మీతో ఉండాలని, ప్రజలంతా ధైర్యంగా జీవితంలో ముందడుగు వేయాలని కోరుకుంటున్నా.

తెలుగు వారంతా ఈ సంవత్సరాన్ని శుభకృత్ నామ సంవత్సరంగా జరుపుకుంటే, తెలంగాణ యువత ఉద్యోగ నామ సంవత్సరంగా చేసుకుంటున్నారని భావిస్తున్నాను.

గౌరవ సీఎం కేసీఆర్ గారు 90 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తుండటంతో, యువత ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నారు.పరీక్షలకు సిద్దమయ్యే యువత టీ- సాట్ ద్వారా టీవిల్లో, యూ ట్యూబ్ లో ఉచితంగా అందుబాటులో ఉండే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మెటీరియల్ ను ఉపయోగించుకుని, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా పిల్లలను ప్రోత్సహించాలని ఆడబిడ్డలందరినీ కోరుతున్నాను.

తెలంగాణ ప్రజలందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube