ప్రేమం మ్యాజిక్ తో పది లక్షల వ్యూస్..!

మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమ తెలుగు రీమేక్ లో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.సూపర్ హిట్ సినిమా ఫీల్ ను ఏమాత్రం మిస్ చేయకుండా యాజిటీజ్ దించేస్తున్నారు దర్శక నిర్మాతలు.

 Chaitu Premam Evare Song 1 Million Views On Youtube-TeluguStop.com

కార్తికేయ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న చందు మొండేటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.ఇక సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుండి క్రేజ్ సంపాదిస్తుండగా రీసెంట్ గా రిలీజ్ అయిన ఎవరే సాంగ్ రిలీజ్ చేశారు మలయాళంలో మలరే అంటూ సాగే ఈ పాట అక్కడ సూపర్ హిట్ ఇక ఇక్కడ కూడా రిలీజ్ చేసిన వారంలోనే పది లక్షల వ్యూస్ తో సరికొత్త రికార్డ్ సృష్టించింది.

నాగచైతన్య కెరియర్ లో ఏ సినిమాకు లేనంత ప్రీ రిలీజ్ బజ్ తో వస్తున్న ప్రేమం కచ్చితంగా ఆడియెన్స్ కు నచ్చుతుందని నమ్మకంతో ఉన్నారు.శృతి హాసన్ తో పాటుగా మాత్రుకలో నటించిన అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ తెలుగు ప్రేమంలో నటిస్తున్నారు.

మరి ఎవరే అంటూ మ్యాజిక్ మొదలు పెట్టిన ప్రేమం చూస్తుంటే సూపర్ హిట్ కొట్టేలా ఉంది.త్రీ స్టేజెస్ ఆఫ్ లైఫ్ అండ్ లవ్ గురించి చెప్పే ప్రేమం తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube