సంతానంనకు రాశి చక్రాలకు సంబంధం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

కొన్ని జంటలు పెళ్లి అయ్యాక తల్లితండ్రులుగా మారటానికి కొంత సమయాన్ని తీసుకుంటూ ఉంటారు.ఇది సహజమే.

 Zodiac Signs Best Parents-TeluguStop.com

అయితే కొంత మంది మాత్రం పిల్లలను ఎప్పుడు ఎత్తుకుందామా అని ఆత్రుత పడుతూ ఉంటారు.ఇలాంటి ఆలోచనలకు రాశి చక్రాలకు సంబంధం ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది కదా.అవును సంబంధం ఉంటుంది.ఇప్పుడు రాశి చక్రం ద్వారా సంతానానికి సంబందించిన ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

మేష రాశి మేష రాశి వారు సంతానం విషయంలో అంత సుముఖంగా ఉండరు.వీరికి జీవితంలో పిల్లలు అనేది చివరి అప్షన్ గా ఉంటుంది.పిల్లలు కలిగితే వీరి పేరును ఎక్కడ తగ్గించేస్తారో అనే అభద్రతా భావం ఉంటుంది.

వృషభ రాశి ఈ రాశి వారికి పిల్లలు కావాలా వద్దా అనే విషయంలో చాలా గందరగోళంగా ఉంటారు.

వీరికి స్పష్టమైన ఆలోచన అనేది ఉండదు.పిల్లలు ఉంటే వారికి అన్ని సౌకర్యాలు కల్పించగలమా అనే సంశయం ఉంటుంది.

మిధున రాశి ఈ రాశి వారు తెలివిగా ఉన్నా సరే పిల్లల విషయంలో కాస్త వెనకడుగు వేస్తారు.వీరు పిల్లల భాద్యతలను ఒక అడ్డంకిగా భావిస్తారు.పిల్లలు కలిగిన తర్వాత కూడా వారు సామజిక సంబంధాలకు దూరంగా ఉండరు.

కర్కాటక రాశి ఈ రాశి వారిలో తల్లితండ్రులు కావాలనే కోరిక విపరీతంగా ఉంటుంది.వివాహం అయిన దగ్గర నుండి పిల్లల కోసం తహతహలాడుతూ ఉంటారు.వీరికి పుట్టబోయే బిడ్డ విషయంలో కూడా చాలా అంచనాలు ఉంటాయి.

సింహ రాశి ఈ రాశి వారికి పిల్లలు ఉండాలనే భావన అనేది ఉండదు.అన్ని కాలానుగుణంగా జరుగుతాయనే ఆలోచనలో ఉంటారు.అయితే పిల్లలు పుట్టాక వారి అభివృద్ధి కోసం చాలా కష్టపడతారు.

కన్య రాశి ఈ రాశి వారు కూడా పిల్లల విషయంలో పెద్దగా ముందడుగు వేయటానికి ఇష్టపడరు.

వీరు ప్రణాళికాబద్ధంగా ఉంటారు.పిల్లలను కూడా ఒక ప్రణాళిక ప్రకారమే భాద్యతగా భావిస్తారు.

తుల రాశి ఈ రాశి వారు పిల్లల పట్ల ప్రేమ ఉన్నా సరే పిల్లల కోసం ముందడుగు వేయటానికి ప్రయత్నాలు చేయరు.పిల్లలు పుట్టాక మాత్రం వారు అందరిలో గొప్పగా ఉండాలని కోరుకుంటారు.

వృశ్చిక రాశి ఈ రాశి వారు పిల్లల గురించి మనస్సులోనే ఆలోచనలు ఉంటాయి బయటకు అసలు చెప్పరు.తమ భావాలను ప్రియమైన వారితోనే పంచుకుంటారు.

వీరు భావోద్వేగాలను గుండెల్లో దాచుకుంటారు.

ధనస్సు రాశి ఈ రాశి వారు పిల్లలు ఎంత ఆలస్యం అయితే అంత బాగుంటుందనే భావనలో ఉంటారు.

వీరి లక్ష్యాలకు పిల్లలు అవరోధం అవుతారనే ఉద్దేశంతో వారి లక్ష్యాలు పూర్తీ పిల్లల గురించి ఆలోచన చేస్తారు.

మకర రాశి ఈ రాశి వారు సంతానం విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోలేరు.

కానీ పిల్లల భవిష్యత్ గిరినుంచి మాత్రం ప్రణాళికలు వేస్తారు.తల్లితండ్రులుగా భాద్యతను తీసుకోవటానికి వెనకడుగు వేస్తారు.

కుంభ రాశి ఈ రాశి వారికీ పిల్లలు ఎంత ఆలస్యం అయితే అంత బెటర్ అని భావిస్తారు.అయితే పిల్లలను మానవత్వపు విలువలు అధికంగా ఉండేలా, భావోద్వేగాలను అవసరాన్ని బట్టి ప్రదర్శించేలా పెంచాలని భావిస్తారు.

మీన రాశి ఈ రాశి వారికి సంతానం అనేది సహజ సిద్దంగా ప్రకృతిలో భాగం అన్న ఆలోచన వీరిది.సంతానం విషయంలో కొంచం తులా రాశి లేదా కర్కాటక రాశి ఆలోచనా విధానాలను కలిగి ఉంటారు.

వీరు స్థిరమైన ఆలోచనలు చేయలేరు.కానీ వీరి సానుభూతితత్వం పిల్లలకు ఇష్టంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube