నోరుజారిన జగన్ ... ఇక కృష్ణ లో కృష్ణార్పణం

నోరుంది కదా అని ఎడా పెడా హామీలు ఇచ్చేస్తే ఆ తరువాత నాలుక కరుచుకోవాల్సిందే అనేది వైఎస్సార్ సీపీ అధినేత జగన్ వ్యవహారం చుసిన ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది.కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే కృష్ణాజిల్లా కు ఎన్టీఆర్ పేరు పెట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఆ సామజిక వర్గం ఓట్లు భారీగా పొందాలని జగన్ భావించాడు.

 Ys Jagan Tongue Slips In Krishna District-TeluguStop.com

అయితే ఆ ప్రకటన జగన్ కు ఏ మాత్రం కలిసి రాకపోగా కొంపలు మునిగే పరిస్థితి తలెత్తడంతో అనవసరంగా ఈ వివాదంలో చిక్కుకున్ననే అని జగన్ లో లోపల తెగ భాధపడిపోతున్నాడట.

ఇక ఆ జిల్లాకు చెందిన సొంత నేతలు సైతం జగన్ ప్రకటనపై గుర్రుగా ఉన్నారట.రాయలసీమ జిల్లాల్లో ఉన్న రాజకీయం వేరు కృష్ణ జిల్లా రాజకీయాలు వేరు.ఇక్కడ కులం అనేది ప్రధానంగా ఉంటుంది.

ఏ పార్టీ గెలవలన్నా ఇదే ఆధారం.కృష్ణ జిల్లాలో జగన్ పాదయాత్ర ప్రవేశించినప్పుడు జగన్ కు లభించిన స్పందన చూసి ఆయనకు కన్ను మిన్ను అనలేదని ఆ పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.

కుల కొట్లాటలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే కృష్ణ జిల్లాలో ప్రధానంగా కమ్మ – కాపు వర్గాలు బలమైనవి.ఇక్కడ రాజకీయాలు చేయాలంటే ఆచితూచి అడుగు వెయ్యాల్సిందే.

ఇప్పుడు కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాలని జగన్ భావించి ఆ ప్రకటన చేయడంతో కాపు సామజిక వర్గం నాయకులు గుర్రుగా ఉన్నారు.అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు ఆ పార్టీ నాయకులు కొంతమంది రంగంలోకి దిగి అబ్బెబ్బే మా నాయకుడి అసలు ఉద్దేశం తెలియక మీరు కంగారు పడుతున్నారు.

.వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల సంఖ్య ను 25 జిల్లాలకు పెంచుతారని, అప్పుడు కృష్ణ జిల్లా కుడా రెండు జిల్లాలుగా విడిపోతుంది అని చెప్తున్నారు.

మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఒక జిల్లా ఏర్పడుతుందని అప్పుడు ఎన్టిఆర్ స్వగ్రామం నిమ్మకూరు కుడా ఉంటుందని, అప్పుడు ఆ జిల్లాకు ఎన్టిఆర్ పేరు పెడతామని ఆ పార్టీ నేతలు వివరణ ఇచ్చుకుంటున్నారు.అయితే ఈ విషయాన్ని కాపులు ఎంతవరకు నమ్ముతారో మాత్రం తెలియదు.

ఏమైనా కృష్ణలో జగన్ ఇరుక్కుపోయినట్టే కనిపిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube