యూట్యూబ్ షార్ట్స్ చేస్తున్నారా? అయితే, ఈ కొత్త అప్ డేట్ గమనించారా?

ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్( Youtube ) గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరమే లేదు.స్మార్ట్ ఫోన్ వున్న ప్రతి ఒక్కరికీ యూట్యూబ్ యాప్ సుపరిచితమే.

 Youtube Introduces New Ad Formats For Shorts Details, Youtube, Shorts, New Featu-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా దీనికి యూజర్లు వున్నారు.దాంతో యూట్యూబ్ నిత్యం సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ ఇతర వీడియో ప్లాట్‌ఫామ్‌లకు మంచి పోటీ ఇస్తోంది.

టిక్‌టాక్‌ వంటి యాప్స్ పలు దేశాలలో బ్యాన్ అయిన నేపథ్యంలో యూట్యూబ్ షార్ట్స్ ను( Youtube Shorts ) పరిచయం చేసింది.అప్పటినుంచి ఈ ఫీచర్‌ను అందరికీ అనుకూలంగా ఉండేలా మెరుగుపరుస్తూ వస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా షార్ట్స్‌లో న్యూ యాడ్ ఫార్మాట్స్( New Ad Formats ) ప్రవేశ పెట్టడం యూట్యూబ్.అంటే యూట్యూబ్‌లో వీడియోలను ప్రమోట్ చేయాలనుకునే వారికి షార్ట్స్‌లో ఈ కొత్త ఫార్మాట్లు అనేవి అందుబాటులో ఉంటాయి.యూట్యూబ్ షార్ట్స్ కొత్త యాడ్ ఫార్మాట్లు వీడియో రీచ్ క్యాంపెయిన్‌లలో అందుబాటులో ఉంటాయని గూగుల్ ఈ సందర్భంగా ప్రకటించడం విశేషం.ఇవి ప్రకటనలను ఆప్టిమైజ్ చేయడానికి, ప్లాట్‌ఫామ్‌లో రీచ్, ప్రభావాన్ని మెరుగుపరచడానికి గూగుల్ ఏఐపై ఆధారపడతాయి.

ఇంకా అర్ధమయ్యేట్టు చెప్పాలంటే, యూట్యూబ్ ప్రకటనల కోసం వీడియో రీచ్ ప్రచారాలను ఉపయోగించే అడ్వటైజర్లు ఇప్పుడు వారి క్యాంపెయిన్‌లో షార్ట్స్‌ను కూడా చేర్చవచ్చన్నమాట.దీని వల్ల ప్రకటనకర్తలు ప్రత్యేక వీడియో రూపొందించకుండా లేదా ఎడిషనల్ స్టెప్స్ అనుసరించకుండానే క్యాంపెయిన్‌లో షార్ట్స్‌ చేర్చవచ్చు.ప్లాట్‌ఫామ్‌లో ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోవడానికి ఇవి మరిన్ని అవకాశాలను కల్పిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.యూట్యూబ్ ‘యూట్యూబ్ సెలెక్ట్ రన్ ఆఫ్ షార్ట్స్ లైనప్’ అనే మరో ఫీచర్‌ను కూడా ప్రారంభించింది.

వ్యూయర్ల షార్ట్ ఫీడ్‌లో పాపులర్, సంబంధిత వీడియోలతో పాటు తమ ప్రకటనలను చూపించడానికి అడ్వర్టైజర్లు ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube