ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడే కొలది రాజకీయం వేడెక్కుతుంది.మే 13న పోలింగ్ నేపథ్యంలో… ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఈ రకంగానే ఏపీ కాంగ్రెస్ పార్టీ( AP Congress Party ) అధ్యక్షురాలు షర్మిల కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ ఎన్నికలలో కడప ఎంపీగా బరిలోకి దిగటం జరిగింది.
ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వం పై ముఖ్యమంత్రి జగన్ పై షర్మిల సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు.ప్రధానంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు( YS Vivekananda Reddy murder Case ) గురించి ప్రస్తావిస్తూ వైసీపీ పార్టీపై తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఓ చోట షర్మిల జగన్ ప్రభుత్వం( CM ys jagan ) పై… విమర్శలు చేస్తుండగా ప్రజలలో ఒకరు జగన్ ప్రభుత్వం వచ్చాక జరిగిన మంచిని షర్మిల ముందే మాట్లాడటం జరిగింది.ఆ వీడియోని వైసీపీ సోషల్ మీడియా విభాగం పోస్ట్ చేసి షర్మిలపై సెటైర్ వేయడం జరిగింది.“మైక్ ఇచ్చి మరీ పరువు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు! జగనన్న పాలనలో ఈ రాష్ట్రంలో ప్రతీ సామాన్యుడికి మంచి జరిగింది, అందుకే సామాన్యులే జగనన్న కి స్టార్ క్యాంపెయినర్లు.ఈ రాష్ట్రంలో ఏ మూలకి పోయి, ఎవరిని అడిగినా ఇలానే గర్వంగా మాట్లాడగలుగుతారమ్మా!” అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది.