యాదాద్రి దేవస్థానము ఈఓ వైఖరిపై స్థానికుల ఆందోళన

యాదాద్రి జిల్లా:యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము ఈఓ గీతారెడ్డి ‌ఒంటెద్దు పోకడకు నిరసనగా స్థానికులు పెద్దయెత్తున ఆందోళన చేపట్టారు.

ఎటువంటి షరతులు లేకుండా దర్శనాలు కల్పించాలని,అవినీతి ఈఓను సస్పెండ్ చేయాలని, ఈఒ డౌన్ డౌన్ అంటూ పెద్దయెత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఆలయ ఈఒ దేవస్థానములోని అధికారులకు ఒక రూల్,ఇతర వ్యక్తులకు ఒక రూల్ ను పెట్టడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.నూతన ప్రధానాలయం నిర్మాణంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Yadadri Temple Locals Concerned Over EO Attitude-యాదాద్రి దే

ఈ అవినీతిలో సగానికి పైగా ఈఓకు వాటా అందిందని ఆరోపించారు.ఈఓపై విచారణ చేపట్టాలని వారు కోరారు.

సీఎం కేసీఆర్ నాకు అండగా ఉన్నాడని ఈఓ ఇష్టమొచ్చిన రీతిగా వ్వవహరిస్తుందని ధ్వజమెత్తారు.ఈ ఆందోళన కార్యక్రమంలో ఉప సర్పంచి భరత్,కర్రె వెంకటయ్య,వార్డు మెంబర్లు,సుమారు 200 మంది స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News