Tiger Painting : వావ్, టైగర్ లాంటి ఈ బాడీ పెయింటింగ్ పోలా, అదిరిపోలా..

పులులు మానవులు స్వార్థపూరితంగా చేసే పనుల వల్ల తమ నివాసాలను కోల్పోతున్నాయి.వ్యవసాయం, కలప కోసం అడవులను ఇష్టారాజ్యంగా నరికి వేయడం వల్ల అవి రోడ్లపై పడుతున్నాయి.

 Wow, This Body Painting Looks Like A Tiger , Body Paint, Tiger Painting, Tiger C-TeluguStop.com

వేటాడటం, పులుల చర్మం అక్రమ వ్యాపారం, మానవ సంఘర్షణ తదితర కారణాలవల్ల పులులు శరవేగంగా అంతరించిపోతున్నాయి.అయితే పులులను సంరక్షించడం మనందరి బాధ్యత అని ఒక కల ద్వారా కొందరు మహిళలు అద్భుతంగా చెప్పారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చెక్కర్లు కొడుతోంది.

వైరల్‌ అవుతున్న వీడియోలో నలుగురు మహిళలు ఒక పులి లాంటి దృశ్యాన్ని ప్రదర్శించేందుకు తమ శరీరంపై పెయింట్ వేసుకున్నారు.

ఈ పెయింట్ పులి శరీర రంగును, చారలను పోలి ఉంది.ఆ తర్వాత వారు ఒక స్టేజ్ పై పులిని పోలి ఉన్న ఒక దృశ్యాన్ని క్రియేట్ చేసేందుకు ఎక్కారు.

అనంతరం వారు ఒకే దగ్గర కూర్చొని అచ్చం పులి లాంటి దృశ్యాన్ని క్రియేట్ చేశారు.ఈ నలుగురు యువతులను చూస్తుంటే ఆ స్టేజ్ పైన నిజంగానే పులి ఉందేమో అనే భ్రమ కలిగింది.

పులి, నోరు, ముక్కు, తోక అన్నీ కూడా చాలా రియలెస్టిక్‌గా వారు ప్రదర్శించారు.ఇంత అద్భుతంగా బాడీ పెయింట్ ఆర్ట్ ప్రదర్శించిన వీరిని నెటిజన్లు పొగడకుండా ఉండలేకపోతున్నారు.

ఈ బాడీ పెయింట్‌ను ప్రదర్శించడానికి వారి ఉద్దేశం ఒకటే అదేంటంటే అంతరించిపోతున్న పులులను సంరక్షించడం.ఈ ఆర్ట్ క్రియేట్ చేయడానికి వారు నగ్నంగా మారి పెయింటింగ్ వేసుకున్నట్లు తెలుస్తోంది.ఏదేమైనా వారి గొప్ప ప్రయత్నాన్ని నెటిజన్లు బాగా మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube