రాజకీయ నాయకులు ఏదన్నా ఒక్కమాట మాట్లాడారు అన్నా.ఎవరిని అయినా పొగిడారు అన్నా సరే ఎదో విషయం నిఘూడంగా దాగిఉంది అని అర్థం…లాభం లేనిదే వ్యాపారం చేయలేము.
ఓట్లు రానిదే హామీలు.పొగడ్తలు బయటకి రావు.
రాజకీయనాయకుల గురించి తెలియనిది ఎవరికిలెండి.కానీ రాజకీయాలలో సిద్దహస్తుడిగా పేరొందిన కేసీఆర్ మాత్రం ఒక స్కెచ్ గీశాడు అంటే అది జరిగి తీరాల్సిందే.
ఎక్కడ ఎవరిని ఎలా ఉపయోగించాలో బాగా తెలిసిన నాయకుడు కేసీఆర్.ఇప్పుడు కేసీఆర్ రాజకీయం తెలంగాణలో ఉన్న ముస్లిమ్స్ చుట్టూ తిరుగుతోంది.
కారణం ఏంటో తెలుసా? ఎందుకు కేసీఆర్ ముస్లిమ్స్ ని అంతలా హైప్ చేస్తున్నాడు అంటే
కేసీఆర్ ముస్లిమ్స్ కి కోరినవి ఇచ్చేయడం.అడక్కుండానే వారు ఊహించని రీతిలో హామీలు ఇవ్వడం.
ఇదంతా టిఆర్ఎస్.ఎంఐఎంతో స్నేహం కొనసాగుతుందని పరోక్షంగా సంకేతాలు ఇవ్వడమే…అంతేకాదు నిజాం రాజుని కీర్తిస్తూ కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తడం.
ఎన్నడు లేనతంగా కేసీఆర్ లో ఈ మార్పుకి కారణం ఏమిటి అనే విషయంపై చాల మంది అనేక రకాల ఊహాగానాలు చేస్తున్నారు విశ్లేషకులు
చంద్రబాబు మాదిరిగా పార్టీపై ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ వస్తున్న కేసీఆర్ ముస్లిమ్స్ అందరు కాంగ్రెస్ వైపౌగా ఆకర్షణ అవుతున్నారు అన్న విషయం తెలిసింది.ఈ విషయం తెలియగానే కేసీఆర్ షాక్ అవ్వడమే కాదు వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు…ఎందుకంటే తెలంగాణలోని ముస్లిమ్స్ ప్రభావం సుమారు 30 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించేదిగా ఉందట.
గత ఎన్నికల్లో టిఆర్ఎస్ వైపు నిలిచినా ఆ ముస్లిమ్స్ అందరు ఇప్పుడు కాంగ్రెస్ వైపు మళ్ళితే? అనే న్యూస్ తెలుసుకున్న కేసేఆర్ మళ్లీ వారిని తమవైపు తిప్పుకోవడానికి వారికి హామీలు ఇవ్వడం మొదలుపెట్టారని.అందులో భాగంగానే ఎంఐఎం కూడా కేసీఆర్ పై, కేసీఆర్ ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపించింది అని దీని వెనుకాల కధ అంతా నడిపించింది.
కేసీఆర్ అని అనుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు.మరి ముల్సిమ్స్ మద్దతు టిఆర్ఎస్ కా లేక కాంగ్రెస్ కా అనేది ముందు ముందు తేలనుంది.