కాంగ్రెస్ లో ఎవరి గోల వారిదే ! 

తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) లో ఎవరి గోల వారిదే అన్నట్లుగా పరిస్థితి తయారయింది .ఒకపక్క అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో,  అధికార పార్టీ బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది.

 Whose Goal Is In Telangana Congress , Telangana Congress, Bjp, Brs, Congress,-TeluguStop.com

పార్టీకి చెందిన కీలక నేతలందరినీ కీలకమైన నియోజకవర్గాల్లో ప్రచారానికి దింపుతోంది.ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.

బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో ఉన్న కాంగ్రెస్ లో పరిస్థితి మొదట్లో కాస్త మెరుగుపడినట్లు కనిపించినా,  పార్టీ సీనియర్ నాయకులు మాత్రం ఎన్నికల ప్రచారానికి మొహం చాటేస్తున్నారు.కేవలం తాము పోటీ చేయబోతున్న నియోజకవర్గంలోనే ఎక్కువగా పర్యటిస్తూ అక్కడ గెలిస్తే చాలు,  తాము ముఖ్యమంత్రి అయిపోతాము అన్న ధీమాతో ఉంటున్నారు .సందర్భం వచ్చినప్పుడల్లా తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని,  తనకే పార్టీ అధిష్టానం ప్రాధాన్యం ఇస్తుందని ప్రకటనలు చేస్తున్నారు.

Telugu Aicc, Congress, Jana, Komativenkat, Revanth Reddy, Telangana-Politics

ఇక కాంగ్రెస్ లో స్టార్ క్యాంపెనర్లు చాలామంది ఉన్నా,  పెద్దగా ఎవరూ ఇతర నియోజకవర్గంలో అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఆసక్తి చూపించడం లేదు.ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎన్నిసార్లు వార్నింగ్ ఇస్తున్న స్టార్ క్యాంపైనర్ల హడావుడి ఎక్కడా కనిపించడం లేదు.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రమే తాను పోటీ చేస్తున్న కొడంగల్,  కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తూనే మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

కానీ స్టార్ క్యాంపెయినర్ల హోదా పొందిన సీనియర్ నాయకులు మాత్రం సైలెంట్ అయిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి , జానారెడ్డి( Janareddy ) , మల్లు భట్టి విక్రమార్క,  జగ్గారెడ్డి ఇంకా అనేక మంది నేతలు కేవలం తమ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతూ,  ఇక్కడ తాము గెలిస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో,  కాంగ్రెస్ లో ఎవరి దారి వారిదే అన్న పరిస్థితి కనిపిస్తోంది.

Telugu Aicc, Congress, Jana, Komativenkat, Revanth Reddy, Telangana-Politics

ఉత్తమ్ కుమార్ రెడ్డి,  కోమటిరెడ్డి వెంకటరెడ్డి,  జానారెడ్డి , మల్లు భట్టి విక్రమార్క,  జగ్గారెడ్డి ఇలా చాలామంది సీఎం కుర్చీపై ఆశలు పెట్టుకుంటూ , సందర్భం వచ్చినప్పుడల్లా తమ మనసులో మాటను బయట పెట్టుకుంటున్నారు తప్ప,  మిగతా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు.  కేవలం తాము పోటీ చేస్తున్న నియోజకవర్గం గెలిస్తే చాలు అనే విధంగానే కీలక నేతలంతా వ్యవహరిస్తూ ఉండడం తో కాంగ్రెస్ లో పరిస్థితి గందరగోళం గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube