ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ వేడి కొనసాగుతోంది.ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తున్నాయి.
అయితే గతంలో ఎన్నికల వ్యూహాకర్తగా బీజేపీ, వైసీపీనే కాకుండా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సైతం పని చేసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్.వ్యూహాకర్తగా పని చేయడం మానేసిన ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) (పీకే) బీహార్ లో పూర్తిస్థాయి పొలిటిషీయన్ గా మారిన సంగతి దాదాపు ప్రతి ఒక్కరికి తెలిసిందే.
తాజాగా ప్రశాంత్ కిషోర్ మరోసారి ఎన్నికల వ్యూహాకర్తలా మారారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే హైదరాబాద్ కు వస్తున్న ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naid )తో భేటీ అయిన సందర్భాలు ఉన్నాయి.
వీరి భేటీపై పలు విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.పాత వాసనలు మర్చిపోని పీకే ఫీజు తీసుకుని ఎలాంటి సర్వేలు, నివేదికలు లేకుండా అభిప్రాయాలను వెల్లడిస్తున్నారని పలువురు బహిరంగంగానే విమర్శలు చేశారని తెలుస్తోంది.
ఇంతకీ ఆయన మాటల్లో శాస్త్రీయత ఎంత? అసలు ఆ వ్యాఖ్యలకు ప్రామాణికత ఉందా? లేదా? అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇటీవలే మరోసారి ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.రానున్న ఎన్నికల్లో సీఎం జగన్( CM Jagan ) గెలవడం కష్టమంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు.ప్రస్తుతం ఇది ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇందుకు కారణం ఆయనకు ఏపీలో ఎటువంటి సర్వే వ్యవస్థ లేదు.నెట్ వర్క్ లేదు.
కనీసం ప్రజాభిప్రాయాలను తెలుసుకునే ఛాన్స్ కూడా లేదు.ఏమీ లేకుండా, ఏమీ తెలియకుండా ఓపెన్ గా స్టేట్మెంట్ ఎలా ఇస్తారంటూ ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.
అలా అని ప్రశాంత్ కిషోర్ నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఇదేమీ మొదటిసారి కూడా కాదని మండిపడుతున్నారు.గతంలో ఆయన చెప్పినదానికి ఫలితాలు పూర్తి రివర్స్ లో వచ్చాయి.
మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ కు తిరుగులేదని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు.అలాగే కర్ణాటకలో బీజేపీ వస్తుందని చెప్పారు.
కానీ ఆయన వెల్లడించిన ఈ రెండూ ఢమాల్ అయ్యాయన్న సంగతి అందరికీ తెలిసిందే.ఛత్తీస్ గఢ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించవచ్చని, ఉత్తరాఖండ్ లో బీజేపీ గెలుస్తుందని తెలిపారు.
కానీ అక్కడ కూడా ఫలితాలు రివర్స్ అయ్యాయి.తాజాగా ఇప్పుడు జగన్ గెలవడం కష్టమని అన్నారు.
దాంతోపాటుగా లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ( Telangana bjp ) మొదటిస్థానంలో నిలుస్తుందని, దక్షిణాదిలో బీజేపీ భారీగా సీట్లు గెలుస్తుందని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే పైన చెప్పిన వాటిలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ మొదటిస్థానంలో నిలవాలంటే.కమలం పార్టీకి కనీసం ఎనిమిది ఎంపీ సీట్లలో విజయం సాధించాల్సి ఉంటుంది.కానీ ప్రస్తుతం తెలంగాణలో ఉన్న బీజేపీ ఆ పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు.
అలాగే తమిళనాడులో అన్నామలై ఎంత బాగా పని చేస్తున్న సరే రెండు, మూడు ఎంపీ సీట్లను గెలవడమే కష్టతరమని అర్థం అవుతోంది.ప్రశాంత్ కిషోర్ అంచనా నిజమవ్వాలంటే సౌత్ లో బీజేపీ కనీసం 30 సీట్లను గెలవాలి.
లేదా గతం (2019 ) తరహాలో 25 సీట్లలో అయినా విజయం సాధించాలి.దీన్ని బట్టి ప్రశాంత్ కిషోర్ ఫీజు తీసుకుని కబుర్లు చెబుతున్నారే కానీ ఆయన మాటల్లో ఎక్కడా ప్రామాణికత కానీ, శాస్త్రీయత కానీ కనిపించడం లేదని ప్రజలు భావిస్తున్నారు.
ఇక ఏపీలో జగన్ గెలవడం కష్టమని చెబుతున్న పీకే టీడీపీ కూటమి విజయం సాధిస్తుందనే ప్రచారాన్ని మొదలు పెట్టారు.కానీ ఆయన అంచనాలు, వచ్చిన ఫలితాలు చూస్తే ఏపీలో రాబోయేది ఎవరనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని రాష్ట్ర ప్రజలు చెబుతున్నారు.
ఇకనైనా ప్యాకేజీ మాటలు పక్కన పెట్టాలని హితవు పలుకుతున్నారట…ఈ నేపథ్యంలోనే ఏపీలో చంద్రబాబు రావడమే కష్టమని మరోసారి ప్రజా ప్రభుత్వంగా పేరుగాంచిన జగన్ సర్కారే అర్థం అవుతుందని అక్కడి ప్రజలు అంటున్నారని సమాచారం.