సినిమా అన్నాక విజయాలు పరాజయాలు చాలా కామన్.అందరు హీరోలకు విజయాలు దక్కుతూనే ఉంటాయి అలాగే ఒక్కోసారి పరాజయాలను చవిచూడాల్సి వస్తుంది.
అయితే ఫ్యామిలీ స్టార్( The Family Star ) విజయ్ దేవరకొండ సినిమా విడుదలైన తర్వాత ఆ మొదటి షో నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నెగటివ్ ట్రోలింగ్ గట్టిగా జరిగింది ఇది సాధారణ స్థాయి కన్నా కూడా ఎక్కువగా ఉండడం విశేషం.మరి మిగతా హీరోల కన్నా విజయ్ దేవరకొండ సినిమాలకు మాత్రమే ఈ పరిస్థితి ఎందుకు కనిపిస్తుంది.
ముఖ్యంగా కాస్త ఫ్లాప్ టాక్ వస్తున్న సినిమాపై ఇంత పెద్ద ఎత్తున నెగెటివ్ పబ్లిసిటీ చేయడం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది.
గతంలో ఖుషి సినిమాకు సంబంధించిన ఒక ఆడియో ఫంక్షన్ లో ఈ విషయంపై విజయ్ దేవరకొం( Vijay Devarakonda )డ నేరుగానే స్పందించాడు.తనపై యూట్యూబ్ లో వీడియోస్, ఫేక్ అకౌంట్స్ తో రేటింగ్స్ ఇవ్వడం, ఫేక్ వీడియోస్ తీయడం, తనపై డిజిటల్ దాడి చేయడం వంటివి తనకు ఇంకా బలాన్ని ఇస్తున్నాయి అంటూ చెప్పాడు.ఎందుకు తనపై దాడి జరుగుతుంది అనే విషయాలపై కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు విజయ్ దేవరకొండ.
ఖుషి సినిమా నుంచి ఫ్యామిలీ స్టార్ వరకు కూడా పరిధిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు సినిమా కాస్త యావరేజ్ టాక్ రాగానే భయంకరమైన నెగటివ్ ట్రోల్లింగ్ మొదలైపోయింది.మంచి ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా మిడిల్ క్లాస్ లైఫ్ ను అద్భుతంగా చూపించే ప్రయత్నం చేసాము అంటూ మేకర్స్ ముందు నుంచి చెబుతూ వచ్చారు.
అయితే షో విడుదలైన తర్వాత రేటింగ్ రావడం వేరు మొదటి షో సగం కూడా పూర్తవక ముందే సోషల్ మీడియా( Social media )లో నెగిటివ్ పబ్లిసిటీ జరగడం వేరు.ఈ విషయంలో ప్రసాదం సోషల్ మీడియాలో బాగా చర్చ సాగుతోంది.సినిమా టాక్ ప్రేక్షకులని థియేటర్ కి రప్పిస్తుంది.అలాగే అసలు సినిమా విడుదల కాకముందే సోషల్ మీడియాలో నెగిటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల జనాలు థియేటర్ కి రావడం మానేస్తున్నారు దానివల్ల ఫ్యామిలీ స్టార్ సినిమా నిజంగానే నష్టాలు చూస్తుంది.
మరి ఇది ముందు ముందు ఇలాగే కొనసాగితే ప్రేక్షకులు ఏ సినిమాని చూడాలి ఎవరిని ఆధారం చేసుకుని చూడాలి అని అనుమానాలు మొదలవుతాయి అందువల్ల ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సి ఉంది.