ఇంటి ఆవరణలో గంజాయి సాగు చేస్తే చివరికి ఏమైందీ...?

నల్గొండ జిల్లా:నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం( Gurrampode) బుడ్డారెడ్డిగూడెంలో 128 గంజాయి మొక్కలను పోలీసులు పట్టుకున్నారు.

గుర్రంపోడు ఎస్సై నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.

బుడ్డారెడ్డిగూడెంలో గంజాయి సాగు చేస్తున్నారన్న ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్సై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాడు.దీంతో కొండమల్లేపల్లి సిఐ ధనుంజయ పర్యవేక్షణలో గుర్రంపోడ్ వ్యవసాయ అధికారి మాధవరెడ్డి సమక్షంలో అక్కడికి వెళ్లి పరిశీలించగా సింగం ముత్యాలు తన ఇంటి ఆవరణలో 128 గంజాయి మొక్కలను పెంచుతుండగా పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకొన్నారు.

What Happens In The End If You Grow Cannabis In Your Home ,Gurrampode ,Cannab

సింగం ముత్యాలుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు.గంజాయి మొక్కల్ని పట్టుకున్న సిఐ,ఎస్సై మరియు పోలీసు సిబ్బందిని దేవరకొండ డిఎస్పీ గిరిబాబు అభినందించారు.

ఈ కార్యక్రమంలో కొండమల్లెపల్లి ఎస్సై రాంమూర్తి,కానిస్టేబుల్స్ నరసింహ,నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News