ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు తోడుగా నిలబడాలి: ధర్మార్జున్

సూర్యాపేట జిల్లా( Suryapet District ):ప్రతి తెలంగాణ జన సమితి కార్యకర్త ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు తోడుగా ఉంటూ ప్రభుత్వం ద్వారా రావలసిన అన్ని సంక్షేమ పథకాలు అందేట్లుగా చూడాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ తెలంగాణ జన సమితి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి ఓడించడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి పార్టీ శ్రేణులు,నేడు జన సమితి పార్టీ మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ( Congress party )ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకం ప్రతి లబ్ధిదారునికి చేర్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు.

రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు సెప్టెంబర్ 1 నుండి 25వ తారీకు లోపు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సభ్యత కార్యక్రమాన్ని చేపట్టి బలమైన పార్టీ నిర్మాణానికి కృషి చేయాలన్నారు.సభ్యత్వ నమోదు కార్యక్రమం పరిశీలనకు నియోజకవర్గస్థాయిలో ఐదుగురు సభ్యులతో సబ్ కమిటీని ప్రకటించారు.

We Should Stand With People In Solving Public Problems Dharmarjun , Suryapet Di

ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్ల రమాశంకర్ అధ్యక్షత వహించగా యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు,రైతు జన సమితి జిల్లా అధ్యక్షుడు పానుగోటి సూర్యనారాయణ( Panugoti Suryanarayana ),పార్టీ మండలాల అధ్యక్షులు కొల్లు కృష్ణారెడ్డి,సుమన్ నాయక్,పలికి రాజు,ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బచ్చల కూర గోపి,లీగల్ సెల్ నాయకులు శ్రీనివాస్, సతీష్,విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్ గౌడ్, పట్టణ మైనార్టీ సెల్ కన్వీనర్ ఫరీరుద్దీన్,ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి మల్సూర్ నాయక్,శ్రీను నాయక్,ఏనుగు మదుసూధన్ రెడ్డి,గోపి, యాకూబ్ రెడ్డి,జగన్ తదితరులు పాల్గొన్నారు.

పెద్దగట్టును దర్శించుకున్న మంత్రి ఉత్తమ్
Advertisement

Latest Suryapet News