నల్లగొండ జిల్లా:చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద గల శ్రీపతి ల్యాబ్ ( Shripati Lab)లో అగ్ని ప్రమాదం సంభవించింది.ల్యాబ్ లో రియాక్టర్ పేలి చుట్టు పక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది.
ప్రమాదం నుంచి కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు.ఘటనపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్( SP Sarath Chandra Pawar ) ఆదేశాలతో సకాలంలో స్పందించిన చిట్యాల పోలిసులు హుటాహుటిన కంపెనీకి చేరుకుని ప్రమాద తీవ్రత పెరగకుండా చర్యలు చేపట్టారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసుల సహకారంతో మంటలు అదుపులోకి తేవడంతో కంపెనీ నిర్వాహకులు,స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.