మనుషులు మూగజీవాల పట్ల వీలైతే ప్రేమ చూపించాలి.లేదంటే మూసుకొని ఉండాలి కానీ, ఎమన్నా తిరిగి అవి తిరగబడవు కదాని ఇక్కడ కొంతమంది దుర్మార్గులు వాటి పట్ల కాస్త చాలా దారుణంగా ప్రవర్తిస్తూ వుంటారు.
ఈ క్రమంలో వాటిని కొట్టడం, ఆకారరణంగా చంపేయడం వంటివి చేస్తుంటారు.అయితే ఎంతటి సాధు జంతువైనా కొన్ని సందర్భాల్లో ప్రతీకారం తీర్చుకుంటాయి.
తమపై దాడి చేసి హింసించిన వారికి గట్టిగా బుద్ధి చెబుతాయి.ఇక సోషల్ మీడియా వచ్చాక ఈ రకమైన వీడియోలు వెలుగు చూస్తుండడం మనం చూడవచ్చు.
ఇక్కడ వీడియోలో ఓ యువకుడు గాడిదను( donkey ) తీవ్రంగా కొట్టడం చూడవచ్చు.ఈ క్రమంలో కాలితో చాలా బలంగా పలుమార్లు దాని మూతి మీద కొట్టడం చేస్తాడు.అంతేకాకుండా తన్నడం కూడా చేస్తాడు.పాపం ఆ మూగజీవి బాధతో విలవిలలాడుతుంది.మొదట ఆ బాధను చాలా మౌనంగా భరిస్తుంది.కానీ, వాడు ఎంతమాత్రం కనికరం చూపలేదు.
అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తాడు.ఆ కాసేపటి తర్వాత ఆ గాడిద మీదకు ఎక్కుతాడు.
దాంతో ఇపుడు గాడిద టర్న్ వస్తుంది.
తనను తీవ్రంగా కొట్టి హింసించిన యువకుకి( young man ) బుద్ధి చేబడమని తన మీదకు ఎక్కగానే.గాడిద వాడి కాలిని తన నోటితో గట్టిగా కొరికేసింది.దాంతో వాడు చాలా దారుణంగా అరుస్తాడు.
అయినా వాడి కాలుని వదల్లేదు.దాంతో ఆ యువకుడు నొప్పితో విలవిలలాడిపోయాడు.
దాని నుంచి విడిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు.నేల మీద పడిపోయాడు.
కానీ, లాభం లేకపోయింది.ఇక శాడిస్ట్ కి తగిన శాస్తి జరిగిందని నెటిజన్లు కామెంట్ సెక్షన్ బాక్సులలో కామెంట్స్ చేస్తున్నారు.
మూగజీవాలతో అమానుషంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోకతప్పదని అంటున్నారు.