ఏడు ఏళ్ల క్రితం మా గల్లీలో కూడా నేనెవరో తెలియదు : రౌడీ స్టార్

టాలీవుడ్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఒక హీరో కాదు.ఒక బ్రాండ్.

 Vijay Devarakonda Speech At Pushpaka Vimanam Event Details, Vijay Devarakonda ,p-TeluguStop.com

అంతలా అభిమానులను సంపాదించాడు విజయ్.అర్జున్ రెడ్డి సినిమాతో టాప్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్న విజయ్ ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో ఇటు క్లాస్ హీరోగా కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు.

ఇక ఈయనకు టాలీవుడ్ లో తిరుగు లేదనే చెప్పాలి.

రౌడీ స్టార్ ఒకవైపు తన సినిమాలు చేస్తూనే మరొకవైపు తన సొంత బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా కూడా మారిపోయాడు.

విజయ్ తర్వాత ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇక ప్రెసెంట్ విజయ్ ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘పుష్పక విమానం’ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇక ఈ సినిమా ఈ నెల 12న విడుదల కాబోతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరిపారు.

ఈ ఈవెంట్ లో విజయ్ చాలా ఆసక్తికర విషయాలను మాట్లాడాడు.

Telugu Pushpakavimanam, Tollywood, Vishakapatnam-Movie

పుష్పక విమానం సినిమా నిర్మిస్తున్న నేపథ్యంలో విజయ్ ప్రమోషన్స్ లో కూడా యాక్టివ్ గా పాల్గొంటూ దగ్గరుండి అన్ని చూసుకుంటున్నాడు.ఈ సినిమాలో నటించిన నటీనరులందరు బాగా చేయడం వల్లనే ఈ సినిమా ఇంత మంచిగా వచ్చింది.నాకంటే దేనియర్స్ నా గురించి మాట్లాడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.

Telugu Pushpakavimanam, Tollywood, Vishakapatnam-Movie

నిజానికి వాళ్లంతా నా సినిమాలో చేయడం నాకు చాలా గర్వకారణం.ఏడు సంవత్సరాల క్రితం మా గల్లీలో కూడా నేను ఎవరికీ తెలియదు.అలాంటిది ఈ రోజు వైజాగ్ వేదికగా నేను యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా నిలబడడం చాలా ఆనందంగా ఉంది.

నన్ను నమ్మి నా విజన్ కోసం చాలా మంది పనిచేస్తున్నారు.వారందరికీ నేను ధన్యవాదాలు చెబుతున్నాను.అంటూ విజయ్ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube