దేశంలో ప్రజలపై భారాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, అయిల్ ధరలు తగ్గించింది.ఎపి ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి.
ఏపీ దేశంలో ఉందా లేదా అనేది జగన్ చెప్పాలి.పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో ప్రభుత్వ వైఖరి వితండవాదంగా ఉంది.
ప్రజాధనం వినియోగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.కరోన సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను ఆదుకుంది.
ఏపీకి కూడా అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం సహాయం చేసింది.ఆత్మ నిర్భర భారత్ కింద కేంద్రం ఏపీకి సాయం చేసింది.
జగన్ కు మోడీ భయం పట్టుకుంది.మోడీతో జగన్ డీ అంటే మేము సిద్ధంగా ఉన్నాం.మేము ఏంటో ఏపీ ప్రభుత్వానికి చూపిస్తాం.కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రకటనలు ఇస్తారా.
ఏపీలో ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది.అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు టాక్సులు తగ్గించినప్పుడు ఏపీ ప్రభుత్వంఎందుకు తగ్గించదు.
మేము సాయం చేస్తేనే ఏపీని పరిపాలిస్తామని ఎన్నికల ముందు ఎమ్మెల్యే పార్థసారథి ఎందుకు చెప్పలేదు మీకు ఓట్లు వేస్తే ప్రత్యేక హోదా, రాజధాని తెస్తామని ప్రజలను మోసం చేశారు.ఏపీలో జాతీయ రహదారులను అభివృద్ధి చేసాం.
మోడీ విజయవాడలోనే ఉన్నారు రాజధాని ఇక్కడే ఉండాలని మేము అభివృద్ధి చేస్తున్నాం.ఏపీలో 2500 కోట్లు రాజధానికి ఇచ్చాము,4700 కోట్ల రుణం ఇప్పించాం.రోడ్లపై గోతులు పూడ్చలేని జగన్ ప్రభుత్వం,గోతులు తవ్వే రాజకీయాలు చేయొద్దు.మాట ఇచ్చి రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు.
రాజధానిపై మాట ఇచ్చి మాట ఎందుకు తప్పారు.రాజధాని నిర్మాణం పేరుతో 4రూపాయల సెస్ వసూలు చేస్తూ రాజధాని ఎందుకు నిర్మించడం లేదు.
రాజధాని నిర్మిస్తామని ఒకరు పారిపోయారు.అస్తవ్యస్తం నిర్ణయాలతో ఆంద్ర రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారు.
రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వానికి చర్చకు రావాలని ఛాలెంజ్ విసురుతున్నమేము ఎంత పెంచామో ఎంత తగ్గించామో చాలా స్పష్టంగా చెప్పాం
.