ఏడు ఏళ్ల క్రితం మా గల్లీలో కూడా నేనెవరో తెలియదు : రౌడీ స్టార్

టాలీవుడ్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఒక హీరో కాదు.ఒక బ్రాండ్.

అంతలా అభిమానులను సంపాదించాడు విజయ్.అర్జున్ రెడ్డి సినిమాతో టాప్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్న విజయ్ ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో ఇటు క్లాస్ హీరోగా కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు.

ఇక ఈయనకు టాలీవుడ్ లో తిరుగు లేదనే చెప్పాలి.రౌడీ స్టార్ ఒకవైపు తన సినిమాలు చేస్తూనే మరొకవైపు తన సొంత బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా కూడా మారిపోయాడు.

విజయ్ తర్వాత ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక ప్రెసెంట్ విజయ్ ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'పుష్పక విమానం' సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇక ఈ సినిమా ఈ నెల 12న విడుదల కాబోతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరిపారు.

ఈ ఈవెంట్ లో విజయ్ చాలా ఆసక్తికర విషయాలను మాట్లాడాడు. """/"/ పుష్పక విమానం సినిమా నిర్మిస్తున్న నేపథ్యంలో విజయ్ ప్రమోషన్స్ లో కూడా యాక్టివ్ గా పాల్గొంటూ దగ్గరుండి అన్ని చూసుకుంటున్నాడు.

ఈ సినిమాలో నటించిన నటీనరులందరు బాగా చేయడం వల్లనే ఈ సినిమా ఇంత మంచిగా వచ్చింది.

నాకంటే దేనియర్స్ నా గురించి మాట్లాడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. """/"/ నిజానికి వాళ్లంతా నా సినిమాలో చేయడం నాకు చాలా గర్వకారణం.

ఏడు సంవత్సరాల క్రితం మా గల్లీలో కూడా నేను ఎవరికీ తెలియదు.అలాంటిది ఈ రోజు వైజాగ్ వేదికగా నేను యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా నిలబడడం చాలా ఆనందంగా ఉంది.

నన్ను నమ్మి నా విజన్ కోసం చాలా మంది పనిచేస్తున్నారు.వారందరికీ నేను ధన్యవాదాలు చెబుతున్నాను.

అంటూ విజయ్ చెప్పుకొచ్చారు.

అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాల మీద భారీ ఫోకస్ పెడుతున్నాడా..?