వీడియో: కదులుతున్న కారు రూఫ్‌పై కూర్చొని మూతులు నాక్కున్న హైదరాబాద్ జంట..

నేటి యువత ఫారిన్ కల్చర్ కి బాగా అలవాటు పడుతోంది.చాలా ఏళ్ల క్రితమే భారతీయ ఆచార సంప్రదాయాలను( Indian customs ,traditions ) యువత తుంగలోకి తొక్కింది.

 Video Hyderabad Couple Licking Their Lips While Sitting On The Roof Of A Moving-TeluguStop.com

పెళ్లి కాకముందే లవ్ అంటూ రొమాన్స్ అంటూ అన్ని హద్దులు చెరిపేసింది.అప్పట్లో వీటన్నిటిని రహస్యంగా చేసేవారు కానీ ఇప్పుడు బహిరంగంగానే రొమాన్స్ చేస్తూ అందరికీ షాక్ లు ఇస్తున్నారు.

ముఖ్యంగా కదులుతున్న వాహనాలపై కూర్చొని రొమాన్స్ చేస్తూ వారి ప్రాణాలనే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా రిస్కులోకి నెడుతున్నారు.ఇలాంటి మరొక ఘటన తాజాగా తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

హైదరాబాద్‌లోని ఓ రోడ్డుపై శనివారం రాత్రి ఓ జంట అత్యంత అసభ్యంగా ప్రవర్తించింది.పీ.వీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై( PV Narasimha Rao Expressway ) కారు కదులుతున్న సమయంలో వారు తమ కారుపైకి ఎక్కి ఒకరినొకరు చాలాసార్లు ముద్దుపెట్టుకున్నారు.ఈ రోడ్డు అనేక వాహనదారులతో సూపర్ బిజీగా ఉంటుంది.

ఆ లవర్స్ ఇతర వాహనదారులు చూస్తున్నారని గానీ, రోడ్డు నిబంధనలను గానీ పట్టించుకోలేదు.వారు తమ రొమాన్స్ పైనే పూర్తిగా దృష్టి పెట్టి మూతులు నాకున్నారు.

మరో కారులో ప్రయాణిస్తున్న ఒకరు వారిని చూసి షాక్ అయ్యారు.అనంతరం వారు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులలో, ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో అందరికీ చూపించేందుకు వీడియో రికార్డ్ చేశారు.ఆ వీడియోలో జంట ముద్దులు పెట్టుకోవడం, ఆ వ్యక్తి గాలిలో చేయి ఊపడం కనిపించింది.వారు తమను తాము, ఇతరులను కూడా ప్రమాదంలో పడవేసేలా ప్రవర్తించారు.ఆ వీడియో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయగా అది అలా తక్కువ సమయంలో వైరల్ అయింది.అది చూసి చాలా మంది ఆగ్రహానికి లోనయ్యారు.

పోలీసులు కూడా వీడియో చూసి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బందులకు గురిచేసిన దంపతులను గుర్తించి శిక్షించాలని కోరారు.ఈ రకమైన ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, ప్రమాదాలు, గాయాలకు దారితీయవచ్చని వారు చెప్పారు.వీలైనంత త్వరగా జంటను పట్టుకోవాలని కోరారు.దంపతులు రోడ్డును, ప్రజానీకాన్ని గౌరవించాలని అన్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube