కాప్పు ఉద్యమ నేత వంగవీటి రంగ కుమారుడు.ఆయన రాజకీయ వారసత్వంతో ముందుకి వెళ్తున్న నాయకుడు వంగవీటి రాద.
గత ఎన్నికలలో వైసీపీ పార్టీ తరుపున ఎన్నికల బరిలో నిలిచినా వంగవీటి కొద్ది రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసి వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేసాడు.తాను వంగవీటి రంగ ఆశయాల కోసం పని చేస్తున్నా అని, అతని సిద్ధాంతాలని బ్రతికించడం కోసం రాజకీయాలలోకి వచ్చానని ఆత్మ గౌరవం చంపుకొని వైసీపీలో ఉండలేనని విమర్శలు చేసారు.
అలాగే రానున్న ఎన్నికలలో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తా అని చాలా మీడియా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు.
ఇదిలా వుంటే గత కొంత కాలంగా వంగవీటి రాధ టీడీపీలో చేరబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు వంగవీటిని ఆహ్వానిస్తూ కొంత మంది నేతలని కూడా ఆయన దగ్గరకి పంపించారు.అప్పటి నుంచి టీడీపీ పార్టీని వెనకేసుకొని వస్తూ, రంగ హత్య టీడీపీ పార్టీ చేయించింది కాదని, అది కొందరి వ్యక్తుల పని మాత్రమె అంటూ చెప్పుకొచ్చారు.
ఈ నేపధ్యంలో అతను టీడీపీలో చేరుతాడు అనే మాటకి బలం చేకూరింది.ఇదిలా వుంటే వంగవీటి రాధాకృష్ణ ఈ రోజు టీడీపీలో అధికారికంగా చేరబోతున్నారు.
పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధం అయ్యారు.రానున్న ఎన్నికలలో టీడీపీ తరుపున వంగవీటి ఎమ్మెల్యేగా బరిలో నిలబడే అవకాశం వుందని తెలుస్తుంది.
మరి వంగవీటి చేరికతో కాపుల సపోర్ట్ టీడీపీకి ఎంత వరకు లాభిస్తుంది అనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.