వాటికి సర్జరీ చేయించిన వకీల్ సాబ్ బ్యూటీ.. నెటిజన్లు అలా కామెంట్ చేయడంతో?

తెలుగులో అనన్య నాగళ్ల నటించిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాల ద్వారా ఆమెకు మంచి గుర్తింపు దక్కింది.మల్లేశం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అనన్య కెరీర్ మొదలైంది.

 Vakeel Saab Beauty Ananya Nagalla Lips Surgery Details, Ananya Nagalla, Ananya N-TeluguStop.com

తొలి సినిమాతోనే ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అనన్య జన్మించారు.

హైదరాబాద్ లో బీటెక్ చదివిన అనన్య కొంతకాలం పాటు సాఫ్ట్ వేర్ జాబ్ చేశారు.

ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య నటిగా విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు క్రేజ్ ను పెంచుకున్నారు.

ప్లే బ్యాక్ సినిమా కూడా అనన్యకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది.అందం, అభినయం పుష్కలంగా ఉన్న ఈ నటి వకీల్ సాబ్ సినిమాలో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.

వకీల్ సాబ్ మూవీలో అనన్య దివ్య నాయక్ అనే రోల్ లో నటించారు.

అయితే తాజాగా ఈ బ్యూటీ పెదవులకు సర్జరీ చేయించుకున్నారని తెలుస్తోంది.

అయితే సర్జరీ చేయించుకున్న అనన్యకు నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.పెదవులు చిన్నగా ఉండటంతో ఆఫర్లు రావడం లేదని ఎవరో అనన్యకు చెప్పారని ఆ రీజన్ వల్లే ఆమె సర్జరీ చేయించుకున్నారని తెలుస్తోంది.

Telugu Ananya Nagalla, Ananyanagalla, Lips Surgery, Tollywood, Vakeel Saab-Movie

అయితే సర్జరీ చేయించుకున్న తర్వాత ఆమె అందంగా కనిపించడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

నెటిజన్ల నుంచి అలాంటి కామెంట్లు రావడంతో సర్జరీ చేయించుకొని తప్పు చేశానా అని అనన్య నాగళ్ల ఫీల్ అవుతున్నారని సమాచారం అందుతోంది.అనన్యకు వకీల్ సాబ్ సక్సెస్ సాధించినా తెలుగులో పెద్దగా ఆఫర్లు అయితే రావడం లేదు.రాబోయే రోజుల్లో అనన్య వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

ఈ కామెంట్లపై అనన్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube