యూపీలో మొత్తం అన్ లాక్.. ఆ మూడు జిల్లాల్లో మాత్రం కర్ఫ్యూ..!

కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో రాష్ట్రాలన్ని లాక్ డౌన్ లోకి వెళ్లాయి.లాక్ డౌన్ వల్ల కొద్దిపాటి కేసుల తగ్గుదల కనబడగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి.

 Up Unlock Only Three District Curfew, Cm Yogi, Corona Lock Down, Three Districts-TeluguStop.com

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు అన్ లాక్ ప్రక్రియని మొదలుపెట్టారు.ఈ క్రమంలో యూపీలో మూడు జిల్లాల మినహా అంతటా కొవిడ్ కర్ఫ్యూని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు సీఎం యోగి ఆదిత్యానాథ్.

రాష్ట్రంలో ఉన్న 75 జిల్లాల్లో 67 జిల్లాలకు 600 మించి కేసులు రావట్లేదు మీరట్, హరన్ పూర్, గోరఖ్ పూర్ మూడు జిల్లాల్లో మాత్రం 1000కి పైగా కేసులు వస్తుండటంతో అక్కడ కర్ఫ్యూని కొనసాగిస్తున్నారు.

బెరైలీ, బులంద్ షహర్ జిల్లాల్లో కూడా రేపటి నుండి కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని వెల్లడించారు.

కంటైన్మెంట్ జోన్లు కాని ప్రాంతాలకు షాపులు, మార్కెట్లు వారంలో 5 రోజులు తెరచుకునే వీలు కలిగిస్తున్నారు.యూపీ లో అన్ లాక్ ప్రక్రియ దశల వారిగా సాగుతుంది.

అయ్తే 75 జిల్లాల్లో వారంలో రెండు రోజులు మాత్రం కర్ఫ్యూని అమలు చేయనున్నారని తెలుస్తుంద్.ప్రజలు మాస్కులు ధరించడం.

భౌతిక దూరం పాటించడం, గుంపులు గుంపులుగా మార్కెట్లకు వెల్లడం జరిగితే మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉందని అన్నారు సీఎం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube