ఆదివారం సాయంత్రం అకాల వర్ష భీభత్సం

నల్లగొండ జిల్లా:ఆదివారం సాయంత్రం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.ఈదురుగాలులు,ఉరుములు,మెరుపులు,పిడుగులతో భీభత్సం సృష్టించింది.

నల్లగొండ,సూర్యాపేట,యాదాద్రి జిల్లాల్లో అకాల వర్షం దంచి కొట్టడంతో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు,వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి జనజీవనం అస్తవ్యస్తమైంది.ఉదయం నుంచి నిప్పుల వర్షం కురిపించిన భానుడు తన ప్రతాపాన్ని చూపగా మనుషులు,పశుపక్ష్యాదులు వణికిపోయారు.

నల్లగొండ జిల్లాలోని నల్లగొండ,తిప్పర్తి, కనగల్ సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట,చివ్వేంల,మునగాల,ఆత్మకూర్ (ఎస్),యాదాద్రి జిల్లాలో సంస్థాన్ నారాయణపురం మండలాల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది.సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్లో తాటిచెట్టుపై పిడుగు పడి చెట్టుపై మంటలు వ్యాపించాయి.

ఆత్మకూర్ (ఎస్) మండలంలో రోడ్డుకు ఇరువైపులా చెట్లు విరిగి రహదారికి అడ్డంగా పడడంతో వాహనదారుల ఇబ్బందులు పడ్డారు.వెంటనే స్పందించిన ఎస్ఐ సైదులు గౌడ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో వృక్షాలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Advertisement

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఉప్పల కృష్ణకు చెందిన కోళ్ల ఫరామ్ షెడ్డు కొట్టుకుపోయి మొత్తం నేల మట్టం అయింది.అందులో దాదాపు 300 కోళ్లు ఉన్నాయని,10 లక్షల నష్ట వాటిల్లిందని యజమాని తెలిపారు.

అదే విధంగా ఈదురు గాలులతో సంస్థాన్ నారాయణపురం మండలంలో మామిడి కాయలు నేలరాలాయి.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులకు పలుచోట్ల ఇంటిపై రేకులు, రహదారి వెంట ఉన్న హోర్డింగ్స్ ఎగిరిపోయాయి.

విద్యుత్ స్తంభాలు వరిగాయి.వర్షపు నీరు నిలవడంతో రోడ్లు కాస్త చెరువులను తలపించాయి.

ఉదయం నుంచి ఎండలతో విలవిలలాడిన జిల్లా ప్రజలకు వాతావరణం చల్లబడటంతో ఉపశమనం లభించినట్లైంది.కానీ,బలమైన ఈదురుగాలులు,మెరుపులు, ఉరుములకు తోడు పిడుగులు పడడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికాగా, అన్నదాతకు ధాన్యం తడిసి ముద్దైంది.

రాగల నాలుగు రోజులు వర్షాలే...వర్షాలు..!
Advertisement

Latest Nalgonda News