యూరోపియన్ ఇన్ఫర్మేటిక్స్ ఒలింపియాడ్‌: భారత సంతతి బాలికకు రజతం .. ఎవరీ అనన్య గోయల్..?

లండన్‌లో స్థిరపడిన భారత సంతతికి చెందిన 17 ఏళ్ల బాలిక నెదర్లాండ్స్‌( Netherlands )లో జరిగిన యూరోపియన్ బాలికల ఒలింపియాడ్ ఇన్ఫర్మేటిక్స్ (ఈజీఓఐ)లో రజత పతకాన్ని సాధించింది.ఈ పోటీల్లో టీమిండియా 2 కాంస్య పతకాలతో పాటు అత్యుత్తమ ప్రదర్శన చేసింది.

 Uk School Girl Wins Silver For Team India At European Informatics Olympiad , Ne-TeluguStop.com

భారత సంతతికి చెందిన అనన్య గోయల్( Aanya Goyal ) సౌత్ లండన్‌లోని డల్‌విచ్‌ అల్లీన్స్ స్కూల్‌లో చదువుతోంది.ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి గణితమంటే చాలా ఇష్టం.

మ్యాథ్స్‌లోని కఠినమైన సమస్యల పరిష్కారంపై లాక్‌డౌన్‌ సమయాన్ని బాగా వినియోగించుకుని మరింత రాటుదేలింది.లాక్‌డౌన్ సమయంలో ఇంటి దగ్గరే ఉండడంతో తన తండ్రి, మాజీ మ్యాథ్స్ ఒలింపియన్ అమిత్ గోయల్ శిక్షణలో గణితంపై పట్టు సాధించింది అనన్య.

అనంతరం యూకే మ్యాథమ్యాటిక్స్ ట్రస్ట్ (యూకేఎంటీ) నిర్వహించిన గణిత పరీక్షలు రాయడం, వాటిలో మంచి ఫలితాలు రావడంతో ఈజీఎంఓలో పోటీపడే బ్రిటన్ జట్టులో చోటు దక్కించుకుంది.

Telugu Aanya Goyal, Dulwich, Olympiad, London, Netherlands, Uk School-Telugu NRI

కంప్యూటర్ సైన్స్‌పై ఆసక్తి ఉన్న యువతుల విభాగంలో 50 దేశాలకు చెందిన ప్రతిభావంతులతో ఆమె తలపడింది.తన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌తో జట్లకు ఎదురయ్యే సవాళ్లను ఛేదించింది.ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలలో ఒకటిగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇన్ఫర్మేటిక్స్ బాలికల ఒలింపియాడ్‌లో రజత పతకం గెలుచుకున్నందుకు చాలా గర్వంగా ఉందని అనన్య అన్నారు.

Telugu Aanya Goyal, Dulwich, Olympiad, London, Netherlands, Uk School-Telugu NRI

ఈ పోటీలలో ఒక్కొక్కటి ఐదు గంటల చొప్పున రెండు సెషన్‌లు ఉంటాయి.ప్రతి సెషన్‌లో పరిష్కరించడానికి నాలుగు ప్రాబ్లమ్స్ ఇస్తారు.సంక్లిష్టమైన అల్గారిథమిక్ డిజైన్, కోడింగ్ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్‌ను పరిష్కరించాల్సి ఉంటుంది.భారత బృందానికి ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ ఇన్ఫర్మేటిక్స్ (ఐఓఐ) రజత పతక విజేత పరాస్ కస్మల్కర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం ప్యారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్ 2024లో టీమిండియా( Team India )కు మరిన్ని పతకాలు సాధించాలని అనన్య కృతనిశ్చయంతో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube