అసమాన ధైర్య సాహసాలకు, ప్రతిభా పాటవాలకు భారతీయులు పెట్టింది పేరు.మన దేశ చరిత్ర తరచి చూస్తే ఎందరో మహావీరులు కనిపిస్తారు.
విశ్వవిజేత అలెగ్జాండర్‌ను ఎదిరించిన పురుషోత్తముడి నుంచి పృథ్వీరాజ్ చౌహాన్, శివాజీ ఇలా ఎందరో.అయితే వీరి గురించి పాఠ్య పుస్తకాలలో పొందుపరిచారు.
కానీ చరిత్ర చెప్పని వీరులు, వారి గాథలు మనదేశంలో ఎన్నో వున్నాయి.అలాంటి వాటిలో దాదాపు 125 ఏళ్ల క్రితం 14 వేల మంది ముష్కరులను కేవలం 21 మంది సిక్కులు అడ్డుకోవడం కూడా ఒకటి
ఆంగ్లేయులు మనదేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో నేటి పాకిస్తాన్ లోని సారాగర్హి కోట వద్ద జరిగింది ఈ పోరు.14 వేల మంది పఠాన్‌లను అడ్డుకుని మొత్తం 21 మంది సిక్కు సైనికులు వీర మరణం పొందారు.కానీ 1400 మంది ముష్కరులను వారు మట్టుబెట్టారు.
సిక్కు సైనికుల ధైర్యసాహసాలకు ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వం సైతం సెల్యూట్ చేసింది.వీరిందరికి ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ను ప్రదానం చేశారు.
ఈ ఏడాదితో సారాగర్హి యుద్ధానికి 125 ఏళ్లు గడుస్తాయి.సెప్టెంబర్ 12, 1897లో జరిగిన ఈ పోరును యునెస్కో.
ప్రపంచంలోనే 8 అత్యుత్తమ పోరాటాల్లో ఒకటిగా ప్రచురించింది.ఈ ఏడాది జరిగే వార్షికోత్సవ వేడుకలకు 14 మంది యూకే ప్రతినిధుల బృందం హాజరుకానుంది.
ఫిరోజ్‌పూర్‌లోని సారాగర్హి మెమోరియల్‌లో నివాళుర్పించడం, నాటి యుద్ధంలో అమరులైన 21 మంది సిక్కు సైనికుల వారసులను సన్మానించడం, అమృత్‌సర్‌లోని ఇంట్రా సిటీలో సారాగర్హి మార్చ్ వంటి కార్యక్రమాలు ఆరోజు జరగనున్నాయి.