Dharmash Mistry : యూకే కాంపిటీషన్ బోర్డులోకి ఇద్దరు భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌లు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ కీలక స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.తాజాగా లా , ఫైనాన్స్ రంగాల్లో విశేష అనుభవం వున్న ఇద్దరు భారత సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్‌లు యూకే కాంపిటీషన్ అండ్ మార్కెట్ అథారిటీ (సీఎంఏ) బోర్డులో సభ్యులుగా నియమితులయ్యారు.

 Two Indian Origin Executives Appointed To Uks Competition Regulator-TeluguStop.com

ఇది వాణిజ్యంలో పోటీని బలోపేతం చేయడానికి, పోటీ వ్యతిరేక పద్ధతులను అరికట్టడానికి బాధ్యత వహిస్తుంది.

సాంకేతికత, కొత్త వ్యాపార నమూనాలు, ఫైనాన్స్‌లో ప్రత్యేకత కలిగిన వెంచర్ క్యాపిటలిస్ట్ ధర్మాష్ మిస్త్రీ( Dharmash Mistry ) గత వారం బ్రిటీష్ ప్రభుత్వ వ్యాపార, వాణిజ్య విభాగం ద్వారా సీఎంఏలోని నలుగురు కొత్త నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో ఒకరిగా స్థానం దక్కించుకున్నారు.

మిస్త్రీ ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగాలలో విస్తృత శ్రేణి బోర్డులలో పనిచేశారు.ప్రీమియర్ లీగ్, ఫుట్‌బాల్ అసోసియేషన్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా .గతంలో బీబీసీ , బ్రిటీష్ బిజినెస్ బ్యాంక్‌కు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గానూ పనిచేశారు.

Telugu Cmaboard, Cyrus Mehta, Dharmash Mistry, Executive, Uk-Telugu Top Posts

అలాగే లండన్‌లోని అంతర్జాతీయ న్యాయ సంస్థ సీఎంఎస్‌లో మాజీ భాగస్వామి సైరస్ మెహతాను( Cyrus Mehta ) సీఎంఏ బోర్డులో ప్యానెల్ మెంబర్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు.యూరోపియన్ యూనియన్ (ఈయూ) మాజీ అధిపతిగా, సీఎంఎస్‌లో కాంపిటీషన్ టీమ్ హెడ్‌గా, యూకే, ఈయూ కాంపిటీషన్ యాక్ట్, స్టేట్ ఎయిడ్, కన్జూమర్ లా, ట్రేడ్ లా అండ్ రెగ్యులేషన్‌లలో ఆయనకు 35 ఏళ్ల అనుభవం వుంది.

Telugu Cmaboard, Cyrus Mehta, Dharmash Mistry, Executive, Uk-Telugu Top Posts

సీఎంఏ బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సంస్థను ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తారు.చైర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌‌లతో కలిసి పనిచేస్తారు.బోర్డు సభ్యులుగా వారు వ్యూహాత్మక దిశ, విధాన ఫ్రేమ్‌ వర్క్‌ను సెట్ చేయడానికి కూడా బాధ్యత వహిస్తారు.

ప్రాధాన్యతలను అభివృద్ధి చేయడం, మార్కెట్ పరిశోధన సూచనలపై నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేస్తారు.ఇకపోతే.యూకే కాంపిటీషన్ అండ్ మార్కెట్ అథారిటీ (సీఎంఏ)లో ధర్మాష్ మిస్త్రీ, సైరస్ మెహతాలతో పాటు డామే ప్యాట్రిసియా హోడ్గ్‌సన్, జస్టిన్ బాసిని, ఫ్రాంక్ డాంగెర్డ్‌లు స్థానం దక్కించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube