తెలంగాణ‌లో రేపు స్కూళ్లు, కాలేజీల‌కు సెల‌వు...!

నల్లగొండ జిల్లా: ఫిబ్రవరి 8 ని తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా మార్చి, రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు ఉద్యోగులతో సహా సెలవు ప్రకటించింది.

ముస్లింలు పవిత్రమైన రోజుగా జరుపుకునే షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటిస్టూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల క్యాలెండర్లో ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్కు ఆప్షనల్ హాలిడేగా పేర్కొంది.అయితే ఇప్పుడు ఫిబ్రవరి 8 సాధారణ సెలవుగా కాకుండా ఆప్షనల్ హాలిడేగా మార్చింది.

Tomorrow Is A Holiday For Schools And Colleges In Telangana, Tomorrow Holiday ,

హిందువులు శివరాత్రి పండుగ సందర్భంగా రాత్రంతా ఏ విధంగా అయితే జాగారం చేసి దేవుని ప్రార్థిస్తారో,అదే విధంగా ఫిబ్రవరి 8న ముస్లింలు కూడా రాత్రంతా జాగారం చేస్తారు.అంతేకాదు ఆ రాత్రంతా వారు ప్రార్థనలు చేస్తూ ఉండిపోతారు.

ఇక ఈ షబ్-ఎ-మెరాజ్ పండగ రోజున ఇస్రా,మేరాజ్ల కథను మసీదుల్లో ఉండే వారందరికీ వివరిస్తుంటారు.ముస్లింలకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పండుగ రోజున తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెలవుగా ప్రకటించడంతో ముస్లింలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇక రేపు (ఫిబ్రవరి 8న) తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించడంతో ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూత పడనున్నాయి.ఇకపోతే ఫిబ్రవరి 8వ తేదీ తర్వాత ఈ నెలలో సాధారణ సెలవులు అస్సలు లేవు.

ఇక వచ్చే నెల అంటే మార్చి నెలలోనే సాధారణ సెలవులు ఉన్నాయి.మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా సెలవు ఉంటుంది.

మార్చి 25న హోలీ పండగ,మార్చి 29వ తేదీన గుడ్ ఫ్రైడే సెలవులు ఉండనున్నాయి.

పన్ను కట్టలేక ఏకంగా జైలుకి వెళ్లిన పవన్ కళ్యాణ్ పెదనాన్న..!
Advertisement

Latest Nalgonda News