Devotional Movies: భక్తిని క్యాష్ చేసుకోవడం మన వారికి తెలిసినట్టు మరెవరికి తెలియదు !

తెలుగు సినిమా మాత్రమే అని చెప్పలేం కానీ యావత్ సౌత్ ఇండియా లోనే భక్తి సినిమాల( Devotional Movies ) విషయానికి వచ్చే సరికి మేకర్స్ కి ఒక రకమైన భయం పట్టుకుంటుందో లేక వారి సినిమా పై వారికే నమ్మకం ఉండదో తెలియదు కానీ ఒక్కోసారి ఒక్కో రకమైన సెంటిమెంట్ తో సినిమాలను లాగుతూ ఉంటారు.అసలు ఇలాంటి సినిమాలు ఎలా ఆడుతాయో అనుకున్న ప్రతిసారి మన దర్శక నిర్మాతల అతి తెలివి తో జనాల వీక్ నెస్ పై కొడుతూ సొమ్ము చేసుకుంటూ ఉన్నారు.

 Tollywood Devotional Movies Collections Bhakta Potana Balanagamma Adipurush Amm-TeluguStop.com
Telugu Adipurush, Ammoru, Balanagamma, Devotional, Gemini Vasan, Hanuman Seat, P

ఉదాహరణకు 1943 లో వాహిని స్టూడియో వారు భక్త పోతన సినిమాను( Bhakta Potana ) తీశారు.అప్పటికి భక్తి మంచి ట్రెండ్ ఉన్నప్పటికి అదే సమయంలో జెమినీ వాసన్ బాలనాగమ్మ సినిమా( Balanagamma ) కోసం హెలికాఫ్టర్ తో కర పాత్రలు పంచుతూ హడావిడి చేసి తమ సినిమాకు మంచి డిమాండ్ క్రియేట్ చేసుకున్నారు.అయితే జెమినీ వాసన్ తో పోటీ పడాలంటే ఏదైనా ఒక కనికట్టు జరగాలని భావించిన వాహిని స్టూడియో పబ్లిసిటీ కార్యక్రమాల ఇంచార్జ్ బి నాగిరెడ్డి ఒక ఉపాయం ఆలోచించాడు.ఈయన బి ఎన్ రెడ్డి కి తమ్ముడు.

అయన ఆలోచన ప్రకారం భక్త పోతన సినిమా విడుదల అయినా ప్రతి థియేటర్ ముందు పాయింటర్స్ ని పిలిపించి 25 నుంచి 50 అడుగుల ఎత్తు తో హనుమంతుడి పెయింటింగ్స్ వేయించాడు.దాంతో జనాలు హనుమంతుడి కోసం క్యూ కట్టి సినిమాను విజయవంతం చేసారు.

Telugu Adipurush, Ammoru, Balanagamma, Devotional, Gemini Vasan, Hanuman Seat, P

ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన వెంకటేశ్వర మహత్యం సినిమా( Venkateswara Mahatyam Movie ) టైం లో కూడా ఇంతే.ప్రతి థియేటర్ ముందు వెంకటేశ్వర స్వామి విగ్రహాలను ప్రతిష్టించడం తో పూజలు హారతులు, హుండీలు కూడా వెలిసి సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఇక సౌందర్య నటించిన అమ్మోరు సినిమా( Ammoru Movie ) టైం లో కూడా ఇదే జరిగింది.సినిమా థియేటర్ ల ముందు అమ్మవారి పేరుతో పూనకాలు వచ్చాయి.

నిర్మాత జేబు కూడా నిండింది.ఇక నేరుగా వచ్చే సినిమాలు మాత్రమే కాదు డబ్బింగ్ సినిమా ల విషయంలోనూ ఇదే జరిగింది.

సంపూర్ణ తీర్థయాత్ర అనే ఒక డబ్బింగ్ సినిమా చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా వంద రోజుల కలెక్షన్స్ చేసుకుంది.వీటి ముందు ఇప్పుడు ఆదిపురుష్ సినిమా( Adipurush Movie ) థియేటర్లలో హనుమంతుడి సీట్ ఒక లెక్క చెప్పండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube