ఈ తీర్థ‌క్షేత్రాల‌ను సంద‌ర్శించేందుకు ఇదే అనువైన కాలం... వివ‌రాలివే...

భారతదేశంలో మతపరమైన తీర్థయాత్రలకు అత్యంత ప్రాధాన్యత ఉంది.చిన్నప్పటి నుండి మీరు దేవాలయాలను సందర్శించడానికి కుటుంబాలతో స‌హా ప్రయాణించడం గురించి వినే ఉంటారు.

 This Is The Best Time To Visit These Places Of Pilgrimage Read More , Haridwar,-TeluguStop.com

ఏ శుభ కార్యమైనా సరే దేవాలయాలు మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం, భగవంతుని దర్శనం చేసుకోవడం అనేది భారతదేశంలో కొన‌సాగే ఆచారం.భ‌గ‌వంతుడిని ద‌ర్శించుకోగ‌ల‌గ‌డం అదృష్టమని చాలామంది భావిస్తారు.

ఆలయాల్లో భగవంతుని దర్శనం చేసుకోవడం ద్వారా భక్తులు ఎనలేని ఆనందాన్ని, మానసిక ప్రశాంతతను పొందుతారు.ఈ జనవరిలో మీరు హరిద్వార్ నుండి గోల్డెన్ టెంపుల్ వరకు ఏయే ప్రదేశాలను సందర్శించేందుకు అనువైన‌వో ఇప్పుడు తెలుసుకుందాం.

హరిద్వార్, ఉత్తరాఖండ్మీరు జనవరిలో హరిద్వార్ పర్యటన చేయవచ్చు.ఇక్కడ మీరు గంగ దర్శనంతో పాటు అందులో స్నానాలు చేయవచ్చు.హరిద్వార్ హిందువులకు ఎంతో పవిత్రమైన ప్రదేశం.మోక్షదాయిని గంగ అని అంటారు.

పవిత్ర నగరం హరిద్వార్‌లో, మీరు అనేక దేవాలయాలను సందర్శించవచ్చు, ఆయా ఆల‌యాల‌లో పూజలు చేయవచ్చు.

Telugu Golden Temple, Jammu, Kashi, Kashmir, Odisha, Pilgrimage, Punjab, Uttar P

కాశీ, ఉత్తర ప్రదేశ్మీరు కాశీని సందర్శించడానికి ఇప్పుడు ప్రణాళిక వేసుకోవచ్చు.వారణాసి చాలా పవిత్రమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది.దేశంలోని నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

కాశీలో విశ్వనాథ స్వామిని దర్శించుకోవచ్చు.ఇది శివుని నగరం.

ఇక్కడ మీరు అనేక దేవాలయాలను సందర్శించి పూజలు చేయవచ్చు.ఇంతేకాకుండా కాశీలో పర్యాటకులు సందర్శించడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి.

వైష్ణో దేవి ఆలయం, జమ్మూ,కాశ్మీర్మీరు జనవరిలో వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించవచ్చు.వైష్ణో దేవిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం భారతదేశంలోని నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు.వైష్ణో దేవి ఆలయం కాశ్మీర్‌లో ఉంది.ఈ ఆలయం త్రికూట్ కొండపై నిర్మిత‌మ‌య్యిది.

వైష్ణోదేవి ఆలయానికి దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది అమ్మవారిని దర్శించుకున్న భక్తుల కోరికలు నెరవేరుతాయని భ‌క్తులు చెబుతారు.

Telugu Golden Temple, Jammu, Kashi, Kashmir, Odisha, Pilgrimage, Punjab, Uttar P

గోల్డెన్ టెంపుల్, పంజాబ్మీరు జనవరిలో అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయాన్ని సందర్శించవచ్చు.ఇక్కడ ఇక్కడ సిక్కుల పవిత్రమైన గురుద్వారా ఉంది, దీనిని గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు.గోల్డెన్ టెంపుల్ సిక్కుల అత్యంత పవిత్రమైన మత స్థలం.

ఈ హర్మందిర్ సాహిబ్ ఆలయాన్ని రామదాస్ సాహిబ్ నిర్మించారు.

జగన్నాథ దేవాలయం, ఒడిశామీరు జనవరిలో ఒడిశాలోని జగన్నాథ ఆలయాన్ని సందర్శించవచ్చు.

ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్ర దేవి ఇక్కడ వెలిశారు.

ప్రతి సంవత్సరం ఇక్కడ జగన్నాథుని రథయాత్ర నిర్వహిస్తారు.ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు కొలువ‌య్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube