మీ ఇన్స్టా స్టోరీలకు తేలికగా యానిమేషన్ యాడ్ చేయడానికి టిప్స్ ఇవే!

ఒకప్పుడు కెమెరా అంటే చాలా గొప్ప.ఓ వేలమందిలో ఒక్కరి దగ్గర వుండేది.

 These Are The Tips To Easily Add Animation To Your Insta Stories , Instagram, Ac-TeluguStop.com

అది చాలా ఖరీదైన వస్తువుగా భావించేవారు.కానీ నేడు పరిస్తితి దానికి పూర్తిగా భిన్నంగా మారింది.

ఫోన్‌ కెమెరాలు( Phone cameras ) అందుబాటులోకి వచ్చాక మనిషి తన జీవితంలో జరిగే ప్రతీ ముఖ్యమైన సందర్భాన్ని ఇతరులతో పంచుకుంటున్నాడు.నేటితరం యువత సామాజిక మాధ్యమాలు, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ట్రెండ్( Instagram trend ) బాగా కొనసాగుతోంది.

టిక్టాక్కు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఇన్స్టా వాడని వాళ్లు ఈ కాలంలో ఎవరూ లేరని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.

Telugu Ups-Latest News - Telugu

ఇన్‌స్టా అనగానే మనకు జిగేల్‌మనే ఫొటోలు, నిడివి తక్కువ ఉన్న వీడియోలు, ఆకర్షణీయమైన స్టోరీలు గుర్తుకు వస్తాయి.మన ప్రతిభను ప్రపంచం ముందు ఉంచడానికి ఇన్స్టా అనేది ఇపుడు చాలా చక్కని వేదిక.అయితే చాలా మంది ఎక్కువమంది వీక్షకులను ఆకర్షించేందుకు తమ స్టోరీలకు యానిమేషన్ యాడ్ ( Animation ad )చేస్తుంటారు.

మరికొందరు ఎలా యాడ్ చేయాలో తెలియక నిరుత్సాహా పడుతుంటారు.కానీ చాలా సింపుల్గా ఇన్స్టా స్టోరీలోని మీ ఫొటోలకు యానిమేషన్ జోడించవచ్చు.

Telugu Ups-Latest News - Telugu

ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఎడిటర్‌ని ఉపయోగించి యానిమేషన్‌ను ఎలా యాడ్ చేయాలంటే.ముందుగా మీరు దానికోసం కొత్త ఇన్స్టాగ్రామ్ స్టోరీని ( Instagram Story )క్రియేట్ చేసుకోవలసి వుంటుంది.తరువాత కొత్త టెక్స్ట్ జోడించడానికి Aa పైన నొక్కాలి.ఆ తర్వాత మీకు కావలసిన టెక్ట్ టైప్ చేసి యానిమేట్ చేయడానికి రెండు-స్పీడ్ లైన్‌లతో ఉన్న A ఐకాన్పై క్లిక్ చేసి దిగువన వచ్చిన వివిధ యానిమేషన్ ప్రీసెట్‌లను బ్రౌజ్ చేయాలి.

తరువాత మీకు బాగా సరిపోయేదాన్ని ఎంచుకోవాలి.మీరు చేసిన మార్పులను సేవ్ చేయడానికి ఎగువ కుడివైపున ఉన్న Doneపై నొక్కితే సరిపోతుంది.మీ స్టోరీకి యానిమేటెడ్ స్టిక్కర్‌లను జోడించడానికి మీరు వివిధ స్టిక్కర్‌లను కూడా బ్రౌజ్ చేయవచ్చు.చివరగా యానిమేటెడ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీని మీ ప్రొఫైల్‌కు అప్‌లోడ్ చేయడానికి యువర్ స్టోరీ బటన్‌ను నొక్కితే సరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube