మీ ఇన్స్టా స్టోరీలకు తేలికగా యానిమేషన్ యాడ్ చేయడానికి టిప్స్ ఇవే!

ఒకప్పుడు కెమెరా అంటే చాలా గొప్ప.ఓ వేలమందిలో ఒక్కరి దగ్గర వుండేది.

అది చాలా ఖరీదైన వస్తువుగా భావించేవారు.కానీ నేడు పరిస్తితి దానికి పూర్తిగా భిన్నంగా మారింది.

ఫోన్‌ కెమెరాలు( Phone Cameras ) అందుబాటులోకి వచ్చాక మనిషి తన జీవితంలో జరిగే ప్రతీ ముఖ్యమైన సందర్భాన్ని ఇతరులతో పంచుకుంటున్నాడు.

నేటితరం యువత సామాజిక మాధ్యమాలు, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ట్రెండ్( Instagram Trend ) బాగా కొనసాగుతోంది.

టిక్టాక్కు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఇన్స్టా వాడని వాళ్లు ఈ కాలంలో ఎవరూ లేరని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.

"""/" / ఇన్‌స్టా అనగానే మనకు జిగేల్‌మనే ఫొటోలు, నిడివి తక్కువ ఉన్న వీడియోలు, ఆకర్షణీయమైన స్టోరీలు గుర్తుకు వస్తాయి.

మన ప్రతిభను ప్రపంచం ముందు ఉంచడానికి ఇన్స్టా అనేది ఇపుడు చాలా చక్కని వేదిక.

అయితే చాలా మంది ఎక్కువమంది వీక్షకులను ఆకర్షించేందుకు తమ స్టోరీలకు యానిమేషన్ యాడ్ ( Animation Ad )చేస్తుంటారు.

మరికొందరు ఎలా యాడ్ చేయాలో తెలియక నిరుత్సాహా పడుతుంటారు.కానీ చాలా సింపుల్గా ఇన్స్టా స్టోరీలోని మీ ఫొటోలకు యానిమేషన్ జోడించవచ్చు.

"""/" / ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఎడిటర్‌ని ఉపయోగించి యానిమేషన్‌ను ఎలా యాడ్ చేయాలంటే.

ముందుగా మీరు దానికోసం కొత్త ఇన్స్టాగ్రామ్ స్టోరీని ( Instagram Story )క్రియేట్ చేసుకోవలసి వుంటుంది.

తరువాత కొత్త టెక్స్ట్ జోడించడానికి Aa పైన నొక్కాలి.ఆ తర్వాత మీకు కావలసిన టెక్ట్ టైప్ చేసి యానిమేట్ చేయడానికి రెండు-స్పీడ్ లైన్‌లతో ఉన్న A ఐకాన్పై క్లిక్ చేసి దిగువన వచ్చిన వివిధ యానిమేషన్ ప్రీసెట్‌లను బ్రౌజ్ చేయాలి.

తరువాత మీకు బాగా సరిపోయేదాన్ని ఎంచుకోవాలి.మీరు చేసిన మార్పులను సేవ్ చేయడానికి ఎగువ కుడివైపున ఉన్న Doneపై నొక్కితే సరిపోతుంది.

మీ స్టోరీకి యానిమేటెడ్ స్టిక్కర్‌లను జోడించడానికి మీరు వివిధ స్టిక్కర్‌లను కూడా బ్రౌజ్ చేయవచ్చు.

చివరగా యానిమేటెడ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీని మీ ప్రొఫైల్‌కు అప్‌లోడ్ చేయడానికి యువర్ స్టోరీ బటన్‌ను నొక్కితే సరి.

మేడ్చల్ జిల్లాలో షాకింగ్ యాక్సిడెంట్.. వీడియో వైరల్..