వన్డే వరల్డ్ కప్ ముందు భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ లో భాగంగా నేడు తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది.సెప్టెంబర్ 24న రెండో వన్డే, సెప్టెంబర్ 27న మూడో వన్డే జరుగనుంది.
భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ 43 సంవత్సరాల కింద జరిగింది.ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 146 మ్యాచ్లు జరుగగా.భారత్ 54, ఆస్ట్రేలియా 82 సార్లు గెలిచింది.10 మ్యాచ్లు రద్దు అయ్యాయి.అయితే భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్లు ఎవరో చూద్దాం.ఈ జాబితాలో అత్యధిక పరుగులు చేసి సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar ) అగ్రస్థానంలో నిలిచాడు.
భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్లలో 71 మ్యాచ్లు ఆడిన సచిన్ టెండూల్కర్ 9 సెంచరీలు, 15 అర్థ సెంచరీలతో 3077 పరుగులు చేశాడు.
ఈ జాబితాలో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు.రోహిత్ శర్మ 42 మ్యాచులు ఆడి ఎనిమిది సెంచరీలు, 8 అర్ధ సెంచరీలతో 2251 పరుగులు చేశాడు.ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ తన తొలి డబల్ సెంచరీ (209) చేయడం విశేషం.
అంతేకాదు ఆస్ట్రేలియాపై వన్డే డబుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మనే.
ఈ జాబితాలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మూడవ స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ( Virat Kohli ) 46 మ్యాచులు ఆడి 8 సెంచరీలు, 11 అర్థ సెంచరీలతో 2172 పరుగులు చేశాడు.ఈ జాబితాలో ఆసియా జట్టు ఆటగాడైన రిక్కీ పాంటింగ్ నాలుగవ స్థానంలో నిలిచాడు.
రిక్కీ పాంటింగ్ 59 మ్యాచులు ఆడి 6 సెంచరీలు, 9 అర్థ సెంచరీలతో 2164 పరుగులు చేశాడు.ఈ జాబితాలో భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఐదవ స్థానంలో నిలిచాడు.
మహేంద్ర సింగ్ ధోని 55 మ్యాచ్లు ఆడి రెండు సెంచరీలు, 11 అర్థ సెంచరీలతో 1660 పరుగులు చేశాడు.