Hyundai, Mahindra, : మార్చి నెలలో భారత మార్కెట్లో లాంచ్ అవ్వనున్న కార్లు ఇవే..!

దేశవ్యాప్తంగా SUV లకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకున్న హ్యుందాయ్, మహీంద్రా, చైనాకు చెందిన BYD సంస్థ లకు చెందిన నూతన మోడళ్లు మార్చి నెలలో విడుదల అవ్వనున్నాయి.వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకుందాం.హ్యుందాయ్ N- లైన్ మోడల్( Hyundai N-line model ) ను పరిచయం చేయనుండగా, మహీంద్రా XUV 300 ఫేస్ లిఫ్ట్, BYD తన తదుపరి మోడల్ ను పరిచయం చేయనున్నాయి.

 These Are The Cars That Will Be Launched In The Indian Market In The Month Of M-TeluguStop.com

హ్యుందాయ్ క్రెటా N- లైన్:

( Hyundai Creta N-Line ) దేశీయ మార్కెట్లో కాంప్యాక్ట్ SUV లకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకున్న హ్యుందాయ్ మార్చి 11వ తేదీ భారత మార్కెట్లో క్రెటా N- లైన్ ను లాంచ్ చేయనుంది.ఈ కారు లో 1.5 లీటర్ టర్బో- పెట్రోల్ ఇంజన్ తో పాటు ఆరు- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో ఉంటుంది.ఇక ఈ కారు ధర రూ.17.50 లక్షలు ఉంటుందని ఒక అంచనా.ఈ కారుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Telugu Byd, Hyundai, Hyundai Creta, Indian, Mahindra, Mahindra Xuv, Carslaunched

మహీంద్రా XUV 300:

( Mahindra XUV 300 ) దేశీయ మార్కెట్లో నయా XUV 300 ను ఈ మార్చి నెలలో విడుదల చేసేందుకు మహీంద్రా సిద్ధమైంది.కారు ఇంటీరియర్ తో పాటు బయటి వైపు ఉండే డిజైనింగ్ లో కొన్ని కీలక మార్పులు చేసి, బంపర్లు, లైటింగ్ సిస్టం లాంటివి అప్డేట్ చేసి మార్కెట్లోకి ఈ కారును లాంచ్ చేస్తోంది.ఈ మోడల్ కారు ధర రూ.9 లక్షలు ఉంటుందని ఒక అంచనా.

Telugu Byd, Hyundai, Hyundai Creta, Indian, Mahindra, Mahindra Xuv, Carslaunched

BYD సీల్:

( BYD SEAL ) చైనాకు చెందిన ప్రముఖ ఈవీల తయారీ సంస్థ BYD నుంచి దేశీయ మార్కెట్లో మార్చి 5వ తేదీ ఈ కారు అందుబాటులోకి రానుంది.15 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, రెండు వైర్ లెస్ చార్టర్లు లాంటి టెక్నాలజీతో ఉంటాయి.రెండు బ్యాటరీ బ్యాక్ ఆప్షన్( 61.4 కిలో వాట్లు, 82.5 కిలో వాట్లు) లలో ఉంటు, సింగిల్ ఛార్జింగ్ తో 570 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.ఈ కారు ధర రూ.55 లక్షలు ఉంటుందని ఒక అంచనా.ఈ కార్ల అసలు ధర వివరాలు లాంచ్ సమయంలో వెళ్లడవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube