ఆ మూడు స్థానాలపై వీడని ఉత్కంఠ...!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పుల్ జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District )లోని మొత్తం 12 స్థానాలకు ఇప్పటి వరకూ మొదటి విడతలో నల్లగొండ (కోమటిరెడ్డి వెంకటరెడ్డి),నాగార్జున సాగర్ (కుందూరు జైవీర్ రెడ్డి), నకిరేకల్-ఎస్సీ (వేముల వీరేశం),హుజూర్ నగర్ (నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి),కోదాడ (నలమాద పద్మావతి రెడ్డి),ఆలేరు (బీర్ల ఐలయ్య) ఆరు స్థానాలను ఖరారు చేయగా,రెండవ విడతలో మునుగోడు (కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి), దేవరకొండ-ఎస్టీ(నేనావత్ బాలూనాయక్),భువనగిరి (కుంభం అనిల్ కుమార్ రెడ్డి) మూడు స్థానాలపై క్లారిటీ ఇవ్వడంతో 9 స్థానాలకు అభ్యర్ధులు ఖరారైన సంగతి తెలిసిందే.

మిగిలిన మిర్యాలగూడ,తుంగతుర్తి- ఎస్సీ,సూర్యాపేట 3 స్థానాలను పెండింగ్ లో పెట్టింది.

ఆల్రెడీ అభ్యర్ధులను ప్రకటించిన స్థానాల్లో కంటే మిగిలిన ఆ మూడు స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడంపైనే ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.నల్లగొండ జిల్లాలోనే ఖరీదైన నియోజకవర్గం మిర్యాలగూడ.

ఇక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం మొదటి నుండి కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి(బిఎల్ఆర్) పేరు ప్రముఖంగా వినిపించింది.ఆయనకు ఇస్తే గెలుపు అవకాశాలు కూడా మెండుగా ఉంటాయనే చర్చ కూడా జరిగింది.

ఆశావాహుల్లో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు రఘు వీర్ రెడ్డి ( Raghuveer reddy )కూడా ఉన్నా అంతగా ప్రాముఖ్యత లేని కారణంగా బిఎల్అర్ కే టిక్కెట్ దక్కే అవకాశాలు ఉన్నాయని అంచనాకు వచ్చారు.కానీ, వామపక్షాలపొత్తులో భాగంగా ఆ స్థానం సీపీఎంకి కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం మొదలైంది.

Advertisement

కేవలం పొత్తు కోసం కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నపటికీ మిర్యాలగూడను సీపీఎం కు ఇవ్వాలనే ఆలోచనతోకాంగ్రెస్ పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ నేతల రాజకీయ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది ప్రశ్నార్ధకంగా మారింది.

ఇక తుంగతుర్తి అభ్యర్ధుల లిస్ట్ భారీగా ఉంది.సూర్యాపేట జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ స్థానం తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల జాబితా పెద్దగా ఉండడంతో ఎవరిని ఎంపిక చేయాలో అర్దంకాక తర్జనభర్జన అధిష్టానం పడుతున్నారు.

ఇక్కడి నుండి ప్రధానంగా అద్దంకి దయాకర్,మోత్కుపల్లి నర్సింహులు,పిడమర్తి రవి, వడ్డేపల్లి రవి కుమార్,ప్రీతమ్, మందుల సామ్యేలు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.దీనితో అభ్యర్ధి ఎవరనే దానిపై సస్పెన్షన్ కొనసాగుతుంది.

సూర్యాపేటలో దామోదర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి మధ్య ఫైట్ నడుస్తుంది.జిల్లా మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి ప్రకటన కాంగ్రెస్ అధిష్టానానికి కత్తి మీద సాములా మారింది.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
మూసికి పూడిక ముప్పు

ఇక్కడి నుండి మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి( Ramreddy Damodar Reddy ), టిపిసిసి ప్రధాన కార్యదర్శిపటేల్ రమేష్ రెడ్డి ( Patel Ramesh Reddy )మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.గత ఎన్నికల్లో కూడా ఈ ఇద్దరి మధ్య అంతర్గత కొట్లాటే కాంగ్రెస్ కొంప ముంచి,మంత్రి గెలుపుకు సహకరించింది.

Advertisement

ఈసారి కూడా అదే రిపీట్ అయితే ఎలా అని అధిష్టానం ఆచి తూచి అడుగులు వేయడంతో ఇక్కడ అభ్యర్ధి ప్రకటన పెండింగ్ లో పెట్టింది.దీనితో సూర్యాపేట అభ్యర్ధి ఎవరనే దానిపై ఇప్పటికే ఉన్న ఉత్కంఠ ఇంకా పెరిగి నియోజకవర్గ ప్రజలతో పాటు కాంగ్రెస్,బీఆర్ఎస్,బీఎస్పీ, బీజేపీ పార్టీల అభ్యర్దులు,పార్టీ శ్రేణులు నరాలు తెగే ఉత్కంఠకు లోనవుతున్నారు.

ఎవరికీ టిక్కెట్ వస్తే ఎవరికి లాభం,ఎవరికి నష్టం,గెలిచేది ఎవరూ ఓడే దెవరు అనే దానిపై లెక్కలు వేస్తూ భారీ ఎత్తున బెట్టింగ్ లకు దిగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.అందరూ ప్రచారంలో ఉంటే ఈ ముగ్గురు ఎవరనే దానిపై టెన్షన్ నెలకొంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 9 మంది అభ్యర్దులు పుల్ జోష్ లో ప్రచారంలో దూసుకుపోతుంటే ఆ మూడు నియోజకవర్గాల అభ్యర్దులు ఎవరనే సస్పెన్షన్ తెరపడక టిక్కెట్ ఆశిస్తున్న వారు టెన్షన్ లో పడ్డారు.అధిష్టానం మదిలో ఉన్నదెవరో? అవకాశం దక్కేదెవరికో కానీ,పార్టీలు, ప్రజలు మాత్రం ఆ మూడు స్థానాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి ఆ మూడు స్థానాల్లో అభ్యర్దులు ఎవరూ? నిలిచేదెవరు? గెలిచే దెవరు? అనే దానిపై జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది.

Latest Nalgonda News