ఈ పోలీసుల రూటే సపరేటు.. మాస్ స్టెప్పులతో అలరిస్తున్నరు

పోలీసులంటే ఒకానొక కాలంలో వామ్మో అని అనుకునే వారు.అంత కటువుగా ఉండే వారు పోలీసులు.

 The Route Of These Policemen Is Saparetu  Entertaining With Mass Steps , Police-TeluguStop.com

పోలీస్ డ్రెస్ వేసుకుంటేనే ఏదో తెలియని కర్కశత్వం వచ్చేది.కానీ ప్రస్తుతం రోజులు మారిపోయాయి.

పోలీసులు జనాలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ వస్తున్నారు.తమకు తోచిన రీతిలో జనాలను అలరిస్తున్నారు.

కాగా ముంబై మహానగరంలో ఒక పోలీస్ చేసిన డ్యాన్స్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఆయన తన వైరల్ డ్యాన్స్ తో అక్కడున్న వారినే కాకుండా ఈ వీడియో ద్వారా అనేక మంది నెటిజన్ల హృదయాలను కూడా దోచుకుంటున్నాడు.

ఈ పోలీస్ విషయానికి వస్తే ఇతడు ముంబైలోని ఓ ప్రాంతంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.ఇప్పుడు ఇతడు చేసిన వైరల్ డ్యాన్స్ తెగ ట్రెండ్ అవుతోంది.

ఇతగాడి పేరు అమోల్ యశ్వంత్ కాంబ్లే.ఇతడు ముంబైలో జరిగే పలు ఈవెంట్స్ లో డ్యాన్స్ షోలు చేసేవాడు.ఇలా ఇతడు చాలా పెద్ద సెలబ్రెటీలా మారిపోయాడు.కేవలం ఇతడు మాత్రమే కాకుండా ఇప్పటికే చాలా మంది పోలీసులు వైరల్ డ్యాన్సులు చేశారు.

ఒత్తిడి తగ్గించుకోవడం కోసమో మరే ఇతర కారణాల వల్లో పోలీసులు ఇలా వైరల్ డ్యాన్సులు చేస్తూ ట్రెండ్ అవుతున్నారు.ముంబై దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా మన తెలంగాణలో ఒక పోలీస్ వ్యక్తి జాతరలో మాస్ డ్యాన్స్ చేసి చాలా ట్రెండ్ అయ్యాడు.

ఒకప్పుడు పోలీసులను చూస్తేనే సామాన్య జనానికి భయం వేసేది కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారిపోయాయి.పోలీసుల ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రతి ఒక్కరూ చాలా సరదాగా ఉంటున్నారు.

వారి స్ట్రెస్ ను తగ్గించుకోవడం కోసం ఇలా వైరల్ డ్యాన్సులు చేస్తున్నారు.అనతి కాలంలోనే నెటిజన్ల మనసులను దోచుకుంటూ పెద్ద సెలబ్రెటీలుగా మారిపోతున్నారు.

పోలీసులంటే ఎవర్లోనైనా భయం ఉంటే దానిని కూడా తొలగిస్తున్నారు.ఇలా చేస్తున్న పోలీసులకు సలాం చెప్పాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube