మంత్రి అనుయాయుడి భూ మాయాజలం

చెరువు శిఖం,పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి రియల్ వెంచర్.అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులు.

అధికారపార్టీ చేతిలో కీలు బొమ్మలుగా రెవిన్యూ అధికారులు.అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసువాలి.

లేకుంటే తామే ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటాం.-నూనె వెంకట్ స్వామి.

నల్లగొండ జిల్లా:రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రధాన అనుచరుడి భూ కబ్జాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి,ఆక్రమణకు గురైన చెరువు శిఖం మరియు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు.సోమవారం ఆయన నార్కెట్‌పల్లిలోని శ్రీవారిజాల వేణుగోపాలస్వామి దేవాలయ కమాన్ కు ఎదురుగా ఏర్పాటు చేసిన వెంచర్ ను,ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన రహదారిని,నార్కట్‌పల్లి పెద్దచెఱువు శిఖం,ప్రభుత్వ భూములను పార్టీ ప్రతినిధి బృందంతో సందర్శించి, పరిశీలించారు.

Advertisement

అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి అనుయాయుడు,సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల వైస్ ఎంపీపీ జీవన్ రెడ్డి,మరికొందరు కలిసి నార్కెట్‌పల్లి పెద్ద చెఱువు శిఖం భూమిని,దానిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి వెంచర్ వేశారని ఆరోపించారు.ఈ విషయమై గతంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కూడా చేశామని తెలిపారు.

అయినా నేటి వరకు రెవిన్యూ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టలేదని,అక్రమించి అక్రమంగా వేసిన దారుల్ని చెరిపివేయలేదని, అక్రమదారులపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.జాతీయ రహదారికి పక్కనే ఉండటంతో మంత్రి అనుచరుడి కన్ను చెరువు శిఖం,ప్రభుత్వ భూమిపై పడిందని,రెవిన్యూ అధికారులు ప్రజల,ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సింది పోయి,కాసులకు కక్కుర్తి పడి అక్రమణదారులకు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణమే రెవిన్యూ శాఖ అధికారులు ఆక్రమణకు గురైన నార్కెట్ పల్లి పెద్ద చెరువు శిఖం భూమి మరియు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిమి స్వాధీనం చేసుకోవాలని,తక్షణం వెంచర్ డిటిపిసిని రద్దు చేయాలి డిమాండ్ చేశారు.లేనిచో ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో ప్రజల,ప్రభుత్వ ఆస్థులను తామే కాపాడుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పీఆర్ పీఎస్ నాయకులు ముప్పిడి మారయ్య,ఎన్నమళ్ళ పృథ్వీరాజ్,మెడబోయిన ఉపేంద్ర యాదవ్,మునుకుంట్ల శ్రీనివాస్ గౌడ్,పోతెపాక విజయ్ తదితరులు పాల్గొన్నారు.

పైలట్ ప్రాజెక్టు భూ సర్వే ఎల్లాపురం శివారులో షురూ
Advertisement

Latest Nalgonda News